వైసీపీని ఖాళీ చేయిస్తున్న టీడీపీ

వైసీపీకి ఏపీలో అధికారం పోయింది. అది కూడా ఘోరాతి ఘోరంగా జరిగింది. ప్రతిపక్ష హోదాకు తగిన సీట్లు అయిన 18 సీట్లు కూడా రాని దుస్థితి ఏర్పడింది

Update: 2024-08-16 12:12 GMT

వైసీపీకి ఏపీలో అధికారం పోయింది. అది కూడా ఘోరాతి ఘోరంగా జరిగింది. ప్రతిపక్ష హోదాకు తగిన సీట్లు అయిన 18 సీట్లు కూడా రాని దుస్థితి ఏర్పడింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయింది వైసీపీని గ్రౌండ్ లో లేకుండా పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది.

ఏ మాత్రం ఆలోచన లేకుండా వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అంతా చేరిపోతున్నారు. ఏపీలో వందకు పైగా మున్సిపాలిటీలు అలాగే 12 దాకా కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో విజయవాడ విశాఖ కార్పోరేషన్లు పెద్దవి. అయితే విశాఖ కార్పోరేషన్ దాదాపుగా టీడీపీ హస్తగతం అయినట్లే.

స్థాయీ సంఘం ఎన్నికల్లో పదికి పదిమంది సభ్యులను టీడీపీ కూటమి గెలిపించుకుంది. దాంతో పాటు వైసీపీ విశాఖ కార్పొరేషన్ లో మైనారిటీలో పడిపోయింది. దాంతో మేయర్ కూటమికే దక్కుతుంది. అలాగే చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు కార్పోరేషన్లు టీడీపీ ఖాతాలో పడిపోతున్నాయి.

ఏ మాత్రం ఒత్తిడి లేకుండానే వైసీపీకి చెందిన కార్పోరేటర్లు అంతా టీడీపీ వైపు క్యూ కడుతున్నారు. అధికార పార్టీలో ఉంటే మేలు అన్న తీరున ఈ చేరికలు కొనసాగుతున్నాయి. మరో వైపు చూస్తే మునిసిపాలిటీలకు మునిసిపాలిటీలు టీడీపీ వశం అవుతున్నాయి.

మాచర్ల, హిందూపురంలలో దాదాపుగా మెజారిటీ కాపోరేటర్లు టీడీపీ బాటన పట్టారు. రానున్న రోజులలో మరిన్ని మునిసిపాలిటీలు టీడీపీ వైపు టర్న్ అవుతాయని అంటున్నారు. 2021లో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క తాడిపత్రి తప్ప అన్ని మున్సిపాలిటీలు వైసీపీ గెలుచుకుంది. ఇపుడు సీన్ మొత్తం రివర్స్ అవుతోంది.

అధికార పార్టీ లో చేరేందుకు ఉవ్విళ్లూరుతూ వైసీపీ కౌన్సిలర్లు కార్పోరేటర్లు ముందుకు సాగడం విశేషం. వచ్చిన వారిని వచ్చినట్లే కండువాలు కప్పి టీడీపీ చేర్చుకుంటోంది. మొత్తం మున్సిపాలిటీలు అన్నీ టీడీపీ ఖాతాలో పడతాయని అంటున్నారు. దీనికి మహా అయితే ఒకటి రెండు నెలల సమయం సరిపోతుంది అని అంటున్నారు.

ఇది జరిగిన తరువాత స్థానిక సంస్థల చట్టానికి సవరణలు చేస్తారు అని అంటున్నారు. ఆ సవరణలు చేస్తే కనుక మేయరు చైర్మన్ల మీద అవిశ్వాసం పెట్టడానికి వీలు కుదురుతుంది. దాంతో ఈలోగానే బలం కూడదీసుకుని టీడీపీ ఒక వ్యూహం ప్రకారమే ముందుకు సాగుతోంది అని అంటున్నారు.

పట్టణాలలలో చూస్తే కనుక గ్రొండ్ లెవెల్ లో వైసీపీ కనిపిస్తుందా అన్నట్లుగా ఈ చేరికలు ఉంటున్నాయి. ఇది జరిగిన తరువాత రూరల్ లోనూ ఫోకస్ పెడతారు అని అంటున్నారు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద కూడా ఫోకస్ పెడితే వారంతా అధికార టీడీపీ కూటమిలో చేరుతారు అని అంటున్నరు.

దాంతో ఏపీలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్లు అలాగే మండల పరిషత్తులు కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు అన్నీ కూడా మరి కొద్ది నెలలలో మొత్తానికి మొత్తం కూటమి ఖాతాలో పడిపోవడం ఖాయమని అంటున్నారు. అంటే వైసీపీని గ్రౌండ్ లెవెల్ లో లేకుండా చేస్తే ప్రయత్నం అన్న మాట.

స్థానిక ప్రజా ప్రతినిధులు ఉంటే పార్టీ బతుకుతుంది. వారే పార్టీ యాక్టివిటీని నిర్వహిస్తారు. కానీ వారంతా ఇపుడు టీడీపీలో చేరితే వైసీపీ మొదటి నుంచి వర్క్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. క్యాడర్ కూడా కకావికలం అవుతున్న వేళ ఒక ప్లాన్ ప్రకారమే వైసీపీని క్షేత్ర స్థాయిలో లేకుండా చేయాలన్నది టీడీపీ కూటమి చేస్తోంది అని అంటున్నారు.

ఇక్కడ చిత్రమేంటి అంటే ఇంత జరుగుతున్నా వైసీపీ నుంచి ఏ మాత్రం ఆపే ప్రయత్నం చేయలేకపోవడం, పార్టీ నేతలు అంతా నియోజకవర్గాల స్థాయిలో సైలెంట్ అయిపోయారు. దాంతో ఎవరు ఏమిటో అర్ధం కాని పరిస్థితి. ఈ పరిణామాలు కూడా టీడీపీ కూటమికి ఎంతో ఉపకరిస్తునాయని అంటున్నారు. ఇదే కనుక జరిగితే వైసీపీ మళ్ళీ పార్టీ పుట్టిన నాటి పరిస్థితికి చేరుకుంటుందని అంటున్నారు. మరి మొదటి నుంచి పార్టీని బిల్డప్ చేయడం అంటే కష్టతరమైన వ్యవహారమే.

అయితే గెలిచిన వారే వైసీపీ బలం కాదని, క్యాడర్ ప్రజలే అసలైన బలం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రజలలో ఒక్కసారి మార్పు వచ్చి వైసీపీకి అనుకూలత పెరిగితే మళ్లీ పార్టీ పుంజుకోవడం ఏమంత కష్టం కాదు అన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచనగా ఉంది అంటున్నారు.

Tags:    

Similar News