టీడీపీ వర్సెస్ వైసీపీ...జనసేన సైలెంట్ గానే ?

లేకపోతే ఇరకాటంలో పడేది అందరూ అని కూడా అంటున్నారు. జనసేన ఇలాంటి విషయాలలో మౌనంగా ఉంది అంటే అది వ్యూహంగానే చూడాలని అంటున్నారు.

Update: 2024-07-20 02:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో జనసేన బీజేపీ భాగస్వాములే. ఈ రెండు పార్టీలకు కలిపి 29 మంది ఎమ్మెల్యేలు నలుగురు మంత్రులు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వానికి పెద్దన్న టీడీపీ అనే చెప్పాలి. ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు ఉన్నారు.

పవన్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా నిర్ణయాత్మకమైన వారుగా బాబు ఉంటున్నారు. గత నెలన్నర కూటమి ప్రభుత్వం తీరు చూస్తే పవన్ తన పరిధిలోనే రెస్పాండ్ అవుతున్నారు. ఇక జనసేన నేతలకు పవన్ హెచ్చరిస్తూ వస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు వద్దు అని ఒకటికి పదిసార్లు చెబుతున్నారు.

ఏది చేసినా చట్ట ప్రకారమే ఉండాలని ఆయన అంటున్నారు. పవన్ అయితే వైసీపీ నేతల మీద ఎలాంటి ఘాటు విమర్శలూ చేయడం లేదు. జనసేన నేతలు మంత్రులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. అయితే టీడీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు వద్దు అని చెబుతున్నా చాలా చోట్ల మాత్రం గ్రౌండ్ లెవెల్ లో ఆ పరిస్థితి అయితే లేదు.

అది గత పదేళ్ళుగా సాగుతున్న వ్యవహారం. పైగా గడచిన అయిదేళ్లుగా చూస్తే వైసీపీ ఏలుబడిలో దెబ్బ తిన్న క్యాడర్ దిగువ స్థాయి లీడర్ మాత్రం గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. మరి టీడీపీ అధినాయకత్వం ఈ విషయంలో ఏమీ చేయలేకపోతోందా అన్నది ఒక చర్చ అయితే టీడీపీ వర్సెస్ వైసీపీగా క్షేత్ర స్థాయిలో రాజకీయం మారిందని వారున్నపుడూ ఇదే తీరు అన్న మాటా ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే ఘర్షణాత్మక మైన వైఖరి వల్ల ఇబ్బంది మాత్రం కూటమికే అని అంటున్నారు. ప్రజలు లా అండ్ ఆర్డర్ విషయంలో నిశిత పరిశీలన చేస్తారు అని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే లోపించే పూర్తిగా అపఖ్యాతి పాలు అయ్యారని గుర్తు చేస్తున్నారు.

ఇక పల్నాడు జిల్లా వినుకొండ విషయమే తీసుకుంటే జరిగింది పాశవిక హత్య. అది వైసీపీ నేత మీద హత్య చేసిన వారు వ్యక్తిగతంగా చేశారా మరోటా అన్నది పక్కన పెడితే కూటమి ప్రభుత్వంలో ఇంత బరితెగించి నడి రోడ్డుపైన దారుణమైన హత్య జరిగింది అంటే అది ప్రభుత్వానికే మచ్చ కదా అన్న చర్చ సాగుతోంది.

లా అండ్ ఆర్డర్ భయపడేలా ఉంటే అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద కిరాతకంగా హత్య చేసే సాహసం ఎవరూ చేయలేరు కదా అని అంటున్నారు. ఈ హత్య నేషనల్ మీడియాను ఎట్రాక్ట్ చేసింది. సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఇంత దుర్మార్గంగా హత్యలు చేసుకుంటారా అన్నది జనంలోకి పోయింది.

ఇది మంచి విధానం కానే కాదని చెప్పాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఇకనైనా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టేందుకు తరతమ భేదాలు చూడాకుండా వ్యవహరించాలని అంటున్నారు. ఇక ఇదే సమయంలో బీజేపీ జనసేన మాత్రం ఈ విషయాన్ని గమనిస్తూ వస్తున్నాయి. ఇదొక్కటే కాదు గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న దాడుల మీద కూడా మిత్రులు కేవలం స్పెక్టేటర్లుగానే వ్యవహరిస్తున్నాయి.

లా అండ్ ఆర్డర్ విషయంలో ఒకటికి పది సార్లు చెప్పిన పవన్ కళ్యాణ్ కి కూడా ఇలాంటివి ఇబ్బందికరమే అని అంటున్నారు. అయితే ఎంత కూటమి ప్రభుత్వం అయినా మిత్రులు తమ సొంత పొలిటికల్ ఐడెంటిటీతో వ్యవహరిస్తారు కాబట్టి ప్రస్తుతానికి బయటపడకపోయినా రానున్న రోజులలో మాత్రం ఇలాంటివి మంచివి కాదు టోటల్ గా కూటమికే చెడ్డ పేరు వస్తుంది అన్నది కూడా ఉంది.

ఈ మొత్తం పొలిటికల్ సినోరియోని చూసినపుడు టీడీపీ అధినాయకత్వమే సీరియస్ గా అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఇరకాటంలో పడేది అందరూ అని కూడా అంటున్నారు. జనసేన ఇలాంటి విషయాలలో మౌనంగా ఉంది అంటే అది వ్యూహంగానే చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీని ఒక గాడిన పెట్టేందుకు కృషి చేస్తూంటే ఈ మధ్యలో ఇలాంటివి చోటు చేసుకోవడం వల్ల పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News