24 గంటల్లో 'పొలిటికల్ సస్పెన్స్'కు తెర!
అయితే.. ఎవరిని తన బృందంలోకి తీసుకోవాలన్న విషయంపై రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
తెలంగాణలో దాదాపు ఐదారు మాసాలుగా నెలకొన్న పొలిటికల్ సస్పెన్స్‌కు మరో 24 గంటల్లో తెరపడ నుంది. రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి వర్గ సీట్లు ఖాళీ ఉన్న విషయం తెలి సిందే. మొత్తం 6 మంత్రి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారా? అంటూ.. కాంగ్రెస్ నాయకులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో ఏర్పడిన రేవంత్ సర్కారు వ్యూహాత్మకంగా.. ఆరు స్థానాలను ఖాళీగా ఉంచిందన్న చర్చ సాగింది.
దీంతో ఈ స్థానాలను దక్కించుకునేందుకు నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియ వాయిదా పడుతూనే ఉంది. తొలుత పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. తర్వాత.. వివిధ కారణాల తోనూ వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. ఎవరిని తన బృందంలోకి తీసుకోవాలన్న విషయంపై రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన జాబితా కూడా ఆయన అధిష్టానానికి ఇదివరకే అందించారని సమాచారం.
ఇక, ఈ జాబితాను అధిష్టానం ఈ రోజు లేదా రేపు(గురువారం) ఓకే అవకాశం ఉందని స్పష్టత వచ్చింది. బుధవారం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీపర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన పార్టీ అధిష్టానంతో ఈ విషయంపైనే చర్చించి.. తుది జాబితాలో హైదరాబాద్ చేరుకుంటారని తెలిసింది. ఆ వెంటనే మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిపోతుందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. మరో 24 గంటల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు పడుతున్న టెన్షన్‌కు తెర పడనుంది.
ఇక, మంత్రి వర్గ జాబితాలో ఉన్న ఆశావహులను పరిశీలిస్తే..లెక్కకు మిక్కిలి సంఖ్యలోనే ఉన్నారు. అయితే.. ఎవరిని వరిస్తుందనేది చూడాలి. మొత్తం మంత్రి మండలిలో సీఎంతో పాటు 17 మందికి అవకాశం ఉంది. అయితే.. డిసెంబరులో ఏర్పాటు చేసిన మంత్రి మండలిలో 11 మంది మాత్రమే ప్రమాణం చేశారు. ఇక, మిగిలిన ఆరుగురినిమామకం మరో 24 గంటల్లో క్లారిటీ రానుంది.