తెలంగాణాలో ఎమ్మెల్యే అభ్యర్ధి ఖర్చు నలభై లక్షలు మాత్రమే...!

తెలంగాణా విషయానికి వస్తే అభ్యర్ధి నలభై లక్షల దాకా ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం నిబంధనలు వీలు కల్పిస్తాయి. అలా కాకుండా పెట్టే ప్రతీ రూపాయి కూడా చట్ట సమ్మతం కాదు సరికదా అవినీతి కిందకు వస్తుంది.

Update: 2023-10-17 17:10 GMT

ఎన్నికలు అంటేనే భారీ ఖర్చు అన్నది అందరిలో ఫిక్స్ అయిన అభిప్రాయం. ప్రతీ అయిదేళ్లకు ఖర్చు అలా పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం మూలంగా గతం కంటే ఎక్కువగా ఎన్నికల సంఘం ఎన్నికలలో అభ్యర్ధులు ఖర్చు చేసే చట్టబద్ధమైన మొత్తాన్ని పెంచుతూనే ఉంటుంది. అయితే దాన్ని పక్కకు పెట్టి అభ్యర్ధులు పోటా పోటీగా పెట్టే ఖర్చు చూస్తే కోట్లకు పరుగెత్తుతుంది.

అందుకే ఎన్నికల్లో ఖర్చుకు జడిసి చాలా మంది పోటీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం అభ్యర్ధులకు ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ఇచ్చిన పరిమితులు ఏంటి, ఎంత వరకూ వారు ఖర్చు చేసుకోవచ్చు, ఎంతవరకూ చట్టబద్దంగా అది ఉంటుంది అన్నది చూస్తే కనుక రాష్ట్రానికి ఒక విధంగా ఈ నిబంధన మారుతుంది. పెద్ద రాష్ట్రాలకు ఒక విధంగా చిన్న రాష్ట్రాలకు మరో విధంగా ఈ లెక్క ఉంటుంది.

తెలంగాణా విషయానికి వస్తే అభ్యర్ధి నలభై లక్షల దాకా ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం నిబంధనలు వీలు కల్పిస్తాయి. అలా కాకుండా పెట్టే ప్రతీ రూపాయి కూడా చట్ట సమ్మతం కాదు సరికదా అవినీతి కిందకు వస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి తీసుకుంటే కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961 లోని రూల్ నంబర్ 9లో ఇవి ఉంటాయి.

దీని ప్రకారం కనుక చూస్తే నలభై లక్షలను తెలంగాణాలో ఒక్కో అభ్యర్ధి ఖర్చు చేయవచ్చు. కానీ నిజంగా అలా జరుగుతుందా అన్నది చూడాలి. తెలంగాణాలో అధికార పార్టీ బీయారెస్ తన అభ్యర్ధులకు ఒక్కొక్కరికీ బీ ఫారాలను ఇస్తూ నలభై లక్షలను కేసీయార్ చెక్కుల రూపంలో అందచేశారు. అంటే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వారి ఖర్చు పూర్తిగా అధికార పార్టీ భరిస్తోంది అన్న మాట.

మరి ఆ మొత్తంతో ఎన్నికలు పూర్తిగా చేయగలుగుతారా అంటే అబ్బే అది ఎందుకు వస్తుందండి అన్నది ఒక సమాధానంగా వస్తోంది. కోట్లు తీయాలి. ప్రస్తుతం ఉన్న అంచనాలు జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే తెలంగాణా ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి కచ్చితంగా నలభై నుంచి యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని అంటున్నారు. అంటే ఎన్నికల సంఘం నిబంధనల కంటే వంద రెట్లు ఎక్కువ అన్న మాట.

అంటే ఒక్క శాతం ఖర్చు మాత్రమే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఖర్చు చేస్తూ మిగిలిన తొంబై తొమ్మిది శాతం తాము పెట్టే ఖర్చు అంతా చట్ట ప్రకారం అవినీతి కిందనే వస్తుందని అభ్యర్థులకు కూడా తెలుసు. ఇంకా చెప్పాలీ అంతే అందరికీ తెలుసు. కానీ అది అలా జరిగిపోతుందంటే.

ఎందుకంటే ప్రతీ అభ్యర్ధి ఎన్నికల సంఘానికి చూపించే లెక్క నలభై లక్షలకు మించదు. ఇంకా చెప్పాలీ అంటే అంతకంటే తక్కువ కూడా చూపిస్తారు. అంటే మిగిలినది అంతా బ్లాక్ గా ఖర్చు చేస్తారు అన్న మాట ఈ లెక్కలేని ఖర్చునే ఎన్నికల అవినీతిగా చూడాలి. దీన్ని కనుక అరికట్టినట్లు అయితే చాలా మంది పోటీ చేసేందుకు ముందుకు వస్తారు అపుడు మంచి అభ్యర్ధులు కూడా పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది అని అంటున్నారు. మరి ఆ రోజులు వస్తాయా. ఏమో చూడాలి.

Tags:    

Similar News