టెలిగ్రామ్ సీఈవో స్పె*ర్మ్ డోనర్!

అంటే వరల్డ్ వైడ్ 12 దేశాల్లోని 100 మందికి పైగా పిల్లలకు పావెల్ దురోవ్ బయోలాజికల్ గా తండ్రి అన్నమాట.

Update: 2024-07-30 14:51 GMT

వీర్యకణాల దాణం (స్పెర్మ్ డొనేషన్) అనేది.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్యకు పరిష్కారం అని అంటుంటారు. వీర్యాన్ని దానం చేసి, సంతానం లేని దంపతులకు సాయం చేయడం అనేది సామాజిక బాధ్యత అని కూడా అంటారు. ఈ సమయంలో తాను కూడా స్పెర్మ్ డోనర్నే అంటూ ప్రకటించారు ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్. ఈ సందర్భంగా అయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అవును... తాను స్పెర్మ్ డోనర్ అంటూ తాజాగా ప్రపంచానికి వెల్లడిస్తూ కీలక విషయాలను పంచుకున్నారు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్. ఈ సందర్భంగా.. వీర్యాన్ని దానం చేసి, సంతానం లేని దంపతులకు సాయం చేయడం అనేది సామాజిక బాధ్యత అని గుర్తు చేస్తున్నారు! ఈ నేపథ్యంలోనే.. తాను ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లోని 100 మందికిపైగా జంటలకు సంతానాన్ని అందించినట్లు తెలిపారు.

అంటే వరల్డ్ వైడ్ 12 దేశాల్లోని 100 మందికి పైగా పిల్లలకు పావెల్ దురోవ్ బయోలాజికల్ గా తండ్రి అన్నమాట. ఈ సందర్భంగా సుదీర్ఘ పోస్ట్ పెట్టిన ఆయన... “పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని ఇష్టపడుతున్న ఓ వ్యక్తికి 100 మందికి పైగా సంతానం ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా?” అని ప్రశ్నిస్తూ... 15 ఏళ్ల కిందట తనకు ఎదురైన అనుభవం.. ఆ అనుభవం తనలో తీసుకొచ్చిన మార్పు దీనికి కారణం అని తెలిపారు.

ఇందులో భాగంగా నాడు తన స్నేహితుడు ఒకరు తనను కలిసి.. అతడికీ, అతడి భర్యకూ పిల్లలు పుట్టే అవకాశం లేదని, అందువల్ల వీర్యదానం చేయమని తనను అడిగినట్లు పావెల్ తెలిపాడు. అయితే తన స్నేహితుడి నుంచి ఆ సాయం గురించిన రిక్వస్ట్ విని మొదట తాను విపరీతంగా నవ్వుకున్నా.. తర్వాత ఆ సమస్య ఎంత తీవ్రమైందో అర్ధం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ సమస్య తీవ్రత గురించి ఓ డాక్టర్ తనకు వివరించారని.. అనంతరం తాను స్పెర్మ్ డోనేషన్ లో రిజిస్టర్ చేసుకున్నట్లు పావెల్ తెలిపారు. అలా రిజిస్టర్ చేసుకున్నప్పటినుంచీ ఇప్పటివరకూ 12 దేశాల్లో వందమందికి పైగా జంటలకు సంతానాన్ని అందించినట్లు తెలిపారు. వాస్తవానికి చాలాకాలం క్రితమే తాను వీర్యదానాన్ని ఆపేసినప్పటికీ.. ఇంకా ఫ్రీజ్ చేసిన తన కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా మరింత ఎక్కువ మంది వీర్యదానానికి ముందుకు రావాలని కోరుతున్నట్లు చెప్పిన పావెల్... దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది.

Tags:    

Similar News