టీడీపీకి ఇది చారిత్రక సంవత్సరం..!
అయితే.. దీనికి సంబంధించి ఆ పార్టీ ఎంత కష్టపడాలి..? అంటే.. సుధీర్ఘ ప్రస్థానం ఉన్న టీడీపీ (40 ఏళ్లు) పెద్దగా కష్టపడాల్సిన అవసరం
ఏ పార్టీకైనా.. గెలుపే పరమావధి. అయితే.. పార్టీల స్థాయి.. వాటి హిస్టరీ వంటివి పరిశీలనకు తీసుకున్నప్పు డు మాత్రం.. గెలుపు విషయం కొంత చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీలో ఇప్పుడు టీడీపీ అధికా రంలోకి రావాలి. చంద్రబాబు మరోసారి గద్దె ఎక్కాలి. ఇదీ.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం లక్ష్యం. అయితే.. దీనికి సంబంధించి ఆ పార్టీ ఎంత కష్టపడాలి..? అంటే.. సుధీర్ఘ ప్రస్థానం ఉన్న టీడీపీ (40 ఏళ్లు) పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
కానీ, పరిస్థితి అయితే.. క్షేత్రస్థాయిలో అలా లేదు. పిల్లకాకి.. అంటూ.. అంతర్గత సమావేశాల్లో వైసీపీ అధి నేత జగన్‌ను.. విమర్శించే కొందరు సీనియర్లు కూడా.. ఇప్పుడు ప్రజాబాట పట్టాల్సిన అవసరం ఏర్పడింది.
దీనికి కారణం.. ఏదైనా కావొచ్చు. ఇప్పుడు ప్రజల్లో ఉంటేనే నాయకులకు గుర్తింపు. రాజకీయాలు అలా మారిపోయాయి. వాస్తవానికి గతంలో ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రమే నాయకులు ప్రజల మధ్యకు వచ్చేవారు.
ఆ పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఎక్కడా లేదు. నిరంతరం.. గత రెండేళ్లుగా నాయకులు ప్రజల్లోనే ఉన్నారు. అటు అధికార పక్షం కావొచ్చు.. ఇటు విపక్షం కావొచ్చు.. నాయకులు ప్రజల మధ్యనే ఉంటున్నారు.
మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసిన పార్టీ అధినేత చంద్రబాబు కూడా.. ప్రజల మధ్యే ఉంటున్నారు. ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారు.
ఇంకో వైపు.. పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. యువగళం పేరుతో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఇక, ఇతర నియోజకవర్గాల్లోనూ నాయకులు తమదైన శైలి లో ప్రజలకు చేరువ అవుతున్నారు.
అయితే.. సుదీర్ఘ ప్రస్థానం ఉన్న పార్టీ కావడం.. 14 ఏళ్ల ముఖ్యమంత్రి ఉండడం.. బలమైన పార్టీ కేడర్, యువసైన్యం, మేధావి వర్గాల అండ ఇలా.. ఎన్నో ఉన్న టీడీపీకి ఇప్పుడు గెలుపు అత్యవసరం.. అందుకే ఈ ఏడాది చారిత్రక అవసరం!!