ఇండియన్స్ కి ఇకపై ఆ చెక్కింగ్ రద్దుకు యూఎస్ ప్రతిపాదన!

ఇందులో భాగంగా... టీ.ఎస్.ఏ. ట్రాన్స్ ఫర్ పాయింట్ల వద్ద భారతీయుల అదనపు భద్రతా తనిఖీలను రద్దు చేసే విషయాన్ని ప్రతిపాదించారు.

Update: 2024-06-29 05:34 GMT

అమెరికా – భారత్ మధ్య బంధం రోజు రోజుకీ బలపడుతుందనే చర్చ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా... వాషింగ్టన్ లో జరిగిన ఇండియా-యూఎస్ ఏవియేషన్ సమ్మిట్ లో యూఎస్ ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ (టీ.ఎస్.ఏ) డేవిడ్ పెకోస్కే ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా... టీ.ఎస్.ఏ. ట్రాన్స్ ఫర్ పాయింట్ల వద్ద భారతీయుల అదనపు భద్రతా తనిఖీలను రద్దు చేసే విషయాన్ని ప్రతిపాదించారు.

ఆవును... అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా... యూఎస్ ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ట్రాన్స్ ఫర్ పాయింట్ల వద్ద ప్రయాణికులు, వారి సామానులను పరీక్షించే అవసరాన్ని తొలగించడానికి భారత్ తో "వన్ స్టాప్ ఒప్పందాన్ని" ప్రతిపాదించింది. దీనివల్ల భద్రతా ఖర్చులు తగ్గుతాయని.. విమాన కనెక్షన్ సమయాలను తగ్గిస్తుందని.. ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని ఇస్తుందని అన్నారు.

ఈ సమ్మిట్ లో యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేటర్ మైకెల్ విటేకర్... విమానయాన భద్రతా సమస్యలపై భారత్ - యూఎస్ లు సహకరించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇదే సమయలో సెక్టార్ లోని నష్టాలను గుర్తించడానికి, తగ్గించడానికి డేటా షేరింగ్ ఎంతో కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇదే సమయంలో సేఫ్టీ అనేది టీం స్పోర్ట్ అని మైఖేల్ విటేకర్ పునరుధ్ఘాటించారు.

ఇదే క్రమంలో... ఓకే గ్లోబల్ నెట్ వర్క్ లో భాగమైన యూఎస్ - భారతీయ విమానయాన వ్యవస్థల పరస్పర అనుసంధాన స్వభావాన్ని ప్రస్థావించారు విటేకర్. ఇందులో భాగంగా... భద్రత వంటి సమస్యలపై కలిసి పనిచేయాలని.. ఆలోచనలు, ఆవిష్కరణలను పంచుకోవాలని.. ముఖ్యంగా కొత్త టెక్నాలజీలను గగనతలంలో సురక్షింగా పొందుపరచాలని చెప్పుకొచ్చారు!

Tags:    

Similar News