డేంజర్ బెల్స్.. పెను ప్రమాదంలో హైదరాబాద్, పుణె, బెంగళూరు
హైదరాబాద్, బెంగళూరు, పుణె లాంటి నగరాలకు వలసల భయం పట్టుకోబోతోంది. ఇంతకీ దక్షిణాది దిక్కునే పరిస్థితి ఎందుకు ఇలా రాబోతోంది? దానికి కారణం ఏంటి?
ఇంతకీ దక్షిణాది దిక్కునే పరిస్థితి ఎందుకు ఇలా రాబోతోంది? దానికి కారణం ఏంటి?
డేంజర్ బెల్స్.. పెను ప్రమాదంలో హైదరాబాద్, పుణె, బెంగళూరు..! ఆ నగరాలకు పొంచి ఉన్న ముప్పు ఏంటి?]
Mass Migration : నిజంగా కల్కి సినిమాలా జీవితాలు మారబోతాయా? భూమిపై జనావాసం తగ్గి కాంప్లెక్స్ ల్లోకి నివాసాలు చేరిట్లు కాలుష్య నగరాలు, గ్రామాల నుంచి సేఫ్ జోన్ సిటీలకు మాస్ మైగ్రేషన్ పెరగబోతోందా? అవును.. వచ్చే పాతికేళ్లలో క్లైమేట్ లో మార్పులు భయపెట్టబోతున్నాయి. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు నివాసానికి కష్టంగా మారబోతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, పుణె లాంటి నగరాలకు వలసల భయం పట్టుకోబోతోంది. ఇంతకీ దక్షిణాది దిక్కునే పరిస్థితి ఎందుకు ఇలా రాబోతోంది? దానికి కారణం ఏంటి?
హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు వలసల ముప్పు..!
దేశంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం.. ఇవన్నీ పెను ప్రమాదానికి సంకేతాలుగా మారబోతున్నాయి. ఈ క్లైమేట్ చేంజస్ ముదిరే కొద్దీ హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు వలసలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఈ విషయాన్ని హెచ్చరించడంతో క్లైమేట్ చేంజ్, మాస్ మైగ్రేషన్ పై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.
నగరాల నుంచి నగరాలకు మాస్ మైగ్రేషన్..
మాస్ మైగ్రేషన్.. దసరాకు సొంతూళ్లకు వెళ్తాం. సంక్రాంతికి ఊరి వెళ్లి సెలబ్రేషన్ చేసుకుని నగరం చేరుకుంటాం. ఇలానే ఫ్యూచర్ లో నగరాల నుంచి నగరాలకు మాస్ మైగ్రేషన్ జరగబోతోందంటున్నారు. అది ఏదో సిటీలను చూసి నాలుగు రోజులు ఉండి రావడానికి కాదు. లైఫ్ ని రిస్క్ లో పెట్టడం ఎందుకని, ప్రమాదకర వాతావరణ పరిస్థితులున్న నగరాల నుంచి సురక్షితంగా అనిపించే వాతావరణ ఉన్న నగరాల్లో జీవించేందుకు భారీగా వలసలు పెరుగుతాయంటున్నారు. రాబోయే పాతికేళ్లలో గ్రామీణ ప్రాంతాలు నివాస యోగ్యతను కోల్పోతాయి. ఇప్పటికే మౌలిక వసతుల లేమి, కాలుష్యం, వాతావరణం మార్పుల ప్రభావం నగరాలపై తీవ్రంగా ఉంది.
పర్యావరణాన్ని గాలికి వదిలేస్తే విధ్వంసం తప్పదా?
ఈ పాతికేళ్లలో దేశంలో వాతావరణ మార్పులు, కాలుష్యంతో ఉత్తరాదిన నగరాల నుంచి దక్షిణాది నగరాలకు భారీగా వలసలు ఉంటాయని అంటున్నారు. మరి దీన్ని ఎలా అరికట్టాలి. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? పర్యావరణాన్ని గాలికి వదిలేస్తే విధ్వంసం తప్పదా? ఎవరు దీనికి బాధ్యులు?
ఈ పాతికేళ్లలో దేశంలో వాతావరణ మార్పులు, కాలుష్యంతో ఉత్తరాదిన నగరాల నుంచి దక్షిణాది నగరాలకు భారీగా వలసలు ఉంటాయని అంటున్నారు. మరి దీన్ని ఎలా అరికట్టాలి. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? పర్యావరణాన్ని గాలికి వదిలేస్తే విధ్వంసం తప్పదా? ఎవరు దీనికి బాధ్యులు?