అమెరికా ప్రమాదం... తెలుగమ్మాయితో సహా ముగ్గురు భారతీయులు మృతి!
ఈ క్రమంలో తాజాగా జార్జియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగమ్మాయితో సహా ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసమని, ఉజ్వల భవిష్యత్తు కోసమని అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులు ప్రమాదాల బారిన పడి మృతిచెందుతున్నారు. ఇలా అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే తెలుగు విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో తాజాగా జార్జియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగమ్మాయితో సహా ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు.
అవును... మంగళవారం రాత్రి అల్ఫారెట్టా, జార్జియాలో ఒకే వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా మృతులను శ్రీయా అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మగా గుర్తించారు. మాక్స్ వెల్ రోడ్డు దాటి వెస్ట్ సైడ్ పార్క్ వే లో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
పోలీసులు చెబుతున్న వివరాళ ప్రకారం... మాక్స్ వెల్ రోడ్డు దాటి వెస్ట్ సైడ్ పార్క్ వేలో ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి చెట్లను ఢీకొట్టింది. అయితే... ఈ ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణం అని అనుమానిస్తున్నారు. మృతులు ముగ్గురూ 18సంవత్సరాల లోపువారని చెబుతున్నారు.
వీరిలో ఆర్యన్ జోషి అల్ఫారెట్టా హైస్కూల్ లో సీనియర్ గా ఉండగా... త్వరలో ఆమె గ్రాడ్యుయేషన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆ స్కూలు ప్రిన్సిపాల్ మైక్ స్కీఫ్లీ, విద్యార్థులు, తల్లిదండ్రులకు తీవ్ర దుఃఖసాగరంలో ముగినిపోయారు! ఇదే సమయంలో... జార్జియా విశ్వవిద్యాలయంలో శ్రీయ, అన్వీ శర్మ తమ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మృతులు ముగ్గురితో పాటు డ్రైవర్ రితివ్క్ సోమేపల్లి, జార్జియా స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి. అల్ఫారెట్టా హైస్కూల్ లో సీనియర్ అయిన మహమ్మద్ లియాకత్ లు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది.