టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే... ఏపీలో వార్ వన్ సైడ్ అంట!
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు సంస్థలు సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి
ఏపీలో మరో నెల రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలూ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఇందులో భాగంగా... "సిద్ధం" అంటూ వైసీపీ భారీ ఎత్తున కార్యకర్తల సభలు నిర్వహిస్తుంటే... "జెండా" అంటూ టీడీపీ - జనసేన పార్టీలు ఉమ్మడి బహిరంగ సభలు పెడుతున్నాయి. ఈ సమయంలో సర్వేల సందడీ మొదలైంది.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు సంస్థలు సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకూ విడుదలైన వాటిలో మెజారిటీ సర్వేలు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం అని నొక్కి చెబుతున్నాయి. అయితే మెజారిటీ విషయంలో మాత్రమే నెంబర్స్ మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో... తాజాగా టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే తెరపైకి వచ్చింది. తాజాగా ఈ సర్వే ఇచ్చిన ఫలితాలు.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉన్నాయి.
ఇందులో భాగంగా... వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే వెల్లడించింది. టీడీపీ - జనసేన కూటమి ప్రభావం అతి స్వల్పం అన్నట్లు తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా ఉన్న 25 పార్లమెంట్ సీట్లలోనూ 21 - 22 సీట్లు వైసీపీ గంపగుత్తగా గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇదే సమయంలో టీడీపీ - జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇతరులు అనే టాపిక్కే లేదని చెప్పిన ఆసర్వే... ఏపీ లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభావం శూన్యం అని వెల్లడించింది. దీంతో... వైసీపీ శ్రేణుల్లో ఈ సర్వే ఫలితాలు సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక సరాసరిన వీటిని అసెంబ్లీ స్థానాలకు కన్వర్ట్ చేసి చూసుకుంటే... 175 స్థానాల్లోనూ వైసీపీకి 147 నుంచి 154 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా... టీడీపీ - జనసేన కూటమికి 21 నుంచి 28 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నమాట!!
టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే: ఏపీ లోక్ సభ ఎన్నికలు - 2024
వైఎస్సార్సీపీ: 21 - 22
టీడీపీ + జనసేన: 3 - 4
ఎన్.డి.ఏ: 0
ఇతరులు: 0