ప్రపంచంలోని టాప్ - 10 ఉత్తమ నగరాలు ఇవే... పదోసారీ అదే ఫస్ట్!

ఈ సందర్భంగా వరల్ద్ బెస్ట్ సిటీస్ – 2025 ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది.

Update: 2024-11-22 10:30 GMT

ప్రపంచంలోనే ఉత్తమ నగరాల జాబితాను రిసోనెన్స్ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా వరల్ద్ బెస్ట్ సిటీస్ – 2025 ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది. ఆర్థికాభివృద్ధి, టూరిజం, రియల్ ఎస్టేట్ రంగాల్లో అంతర్జాతీయ సలహాదారుగా ఉన్న రిసోనెన్స్ సంస్థ పలు కీలక విషయాల ఆధారంగా సర్వే చేసి ఈ జాబితను విడుదల చేసింది.

అవును... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎక్కువగా ఏ నగరంలో జీవించాలని అనుకుంటున్నారు? ఏ నగరాన్ని చూడాలనుకుంటున్నారు? ఏ నగరంలో ఉద్యోగం చేయాలని భావిస్తున్నారు? వంటి పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్న రిసోనెన్స్ సంస్థ ఓ సర్వే చేసింది. దీనికోసం 31 దేశాల్లో 22,000 మంది అభిప్రాయాలను సేకరించింది.

ఈ సర్వే ఫలితాలను తాజాగా ప్రచురించింది. ఇందులో భాగంగా... ప్రపంచంలోని ఉత్తమ నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా లండన్ సిటీ నిలిచింది. అయితే ఇలా నిలవడం లండన్ ను ఇదే మొదటిసారి కాదు. గత పదేళ్లుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే వస్తోంది.

ఇక ఈ జాబితాలోని టాప్-100లో అత్యధికంగా అమెరికాలోని 36 నగరాలు స్థానం సంపాదించడం విశేషం. వీటిలో లండన్ తర్వాత రెండో స్థానంలో న్యూయార్క్ నిలిచింది. అయితే... ఈ జాబితాలో భారతదేశంలోని పెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్ లకు చోటు దక్కకపోవడం గమనార్హం.

ఈ విషయంపై స్పందించిన కన్సల్టెన్సీ ప్రెసిడెంట్ & సీఈఓ క్రిస్ ఫెయిర్ స్పందిస్తూ... ఢిల్లీ, ముంబై నగరాలకు కొన్ని ప్రత్యేక బలాలు ఉన్నాయని.. ఇదే సమయంలో మిగతా నగరాలతో పోలిస్తే నివాస దృక్పథం విషయంలో నిర్ధిష్టమైన బలహీనతలూ ఉన్నాయని అన్నారు. అయితే.. ఫిబ్రవరిలో తమ ఆసియా-ఫసిఫిక్ నివేదికలో ఈ రెండు నగరాలు టాప్ - 20లో ఉన్నాయని తెలిపారు.

ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ నగరాలు!:

లండన్ (యునైటెడ్ కింగ్ డమ్)

న్యూయార్క్ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా)

పారిస్ (ఫ్రాన్స్)

టొక్యో (జపాన్)

సింగపూర్

రోమ్ (ఇటలీ)

మాడ్రిడ్ (స్పెయిన్)

బార్సిలోనా (స్పెయిన్)

బెర్లిన్ (జర్మనీ)

సిడ్నీ (ఆస్ట్రేలియా)

Tags:    

Similar News