టాప్ 10 టెక్నాలజీ కంపెనీలు ఏవో తెలుసా?
అవును... టెక్ జాబ్ లు కల్పించే టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నా.. వాటిలో అత్యధికమందికి జాబ్స్ కలిగించే కంపెనీలు మాత్రం కొన్నే ఉన్నాయి.
ప్రపంచంలో టెక్ జాబ్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేని సంగతి తెలిసిందే! ఆ ఉద్యోగాల్లో ఉండే వేతనాలు.. ఫలితంగా మారిపోయే లైఫ్ స్టైల్, సర్కిల్ మొదలైన కారణాలతో టెక్ జాబ్స్ అంటే యువత ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేంతగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో కంపెనీలలో టాప్ 10 టెక్ కంపెనీలు ఏమిటనేవి ఇప్పుడు చూద్దాం.
అవును... టెక్ జాబ్ లు కల్పించే టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నా.. వాటిలో అత్యధికమందికి జాబ్స్ కలిగించే కంపెనీలు మాత్రం కొన్నే ఉన్నాయి. ఈ టాప్ 10 కంపెనీలలోనే సుమారు అరకోటి మందికిపైగా టెకీలు పనిచేస్తున్నారు. అవును... టైంస్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ "గ్యాడ్జెట్స్ నౌ" నివేదిక ప్రకారం.. టాప్ 10 టెక్నాలజీ కంపెనీలలో సుమారు 50లక్షల మంది టెకీలు పనిచేస్తున్నారని తెలిసింది.
వివరాళ్లోకి వెళ్తే... టాప్ 10 టెక్నాలజీ కంపెనీల్లో ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం "అమెజాన్" టాప్ ప్లేస్ లో ఉంది. ఈ కెంపెనీలో సుమారు 14,61,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ తో సహా వివిధ విభాగాల్లో ఈ పద్నాలుగు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇక అమెజాన్ తర్వాత స్థానంలో... యాపిల్ కు సంబంధించిన అతిపెద్ద ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుగా ఉన్న "ఫాక్స్ కాన్" కంపెనీ నిలిచింది. ఈ ఫాక్స్ కాన్ కంపెనీలో సుమారు 8,26,608 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో ఈ సంస్థ... టాప్ 10 కంపెనీల్లో రెండో స్థానంలో నిలిచింది.
ఇక ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఐటీ కన్సల్టెన్సీ దిగ్గజం "యాక్సెంచర్" ఉంది. ఈ సంస్థలో సుమారు 7,38,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక యాక్సెంచర్ తర్వాతి స్థానంలో భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ "టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్" (టీసీఎస్) 6,14,795 మంది వర్క్ ఫోర్స్ కలిగి ఉంది.
ఇక తర్వాతి స్థానంలో ప్రపంచవ్యాప్తంగా 4,10,000 మంది ఉద్యోగులతో కూడిన గ్లోబల్ డిజిటల్ బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న ఫ్రాన్స్ కు చెందిన "టెలి ఫెర్ ఫర్ఫార్మెన్స్" నిలవగా... యునైటెడ్ స్టేట్స్ కు చెందిన "కాగ్నిజెంట్" దాదాపు 3,51,500 మంది ఉద్యోగులతో తర్వాతి స్థానంలో ఉంది!
ఇదే సమయంలో 3,36,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కన్సల్టింగ్, ఐటీ సేవలలో ప్రత్యేక కంపెనీగా నిలిచిన భారతీయ ఐటీ దిగ్గజం "ఇన్ఫోసిస్" నిలిచింది. 3,16,000 మంది ఉద్యోగులతో జర్మన్ సమ్మేళనం "సిమెన్స్" తర్వాత స్థానంలో నిలిచింది. ఇక తర్వాతి స్థానంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం నిలిచింది.
అవును... యూఎస్ కేంద్రంగా ఉన్న ప్రముఖ టెక్నాలజీ సంస్థ "ఐబీఎం"లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,88,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో పదో స్థానంలో... సాఫ్ట్ వేర్ దిగ్గజం "మైక్రోసాఫ్ట్" నిలిచింది. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,21,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 60 శాతం మంది దాని స్వదేశమైన యునైటెడ్ స్టేట్స్ నుంచే ఉండటం గమనార్హం.