హాంకాంగ్ లో విష సంస్కృతి... మహిళలపై ఇదేం పాడుపని?
తాజాగా ఓ పి.హెచ్.డి. విద్యార్థి ఇలాంటి పనికి పూనుకోవడంతో కోర్టు అతడికి 5వేల హాంకాంగ్ డాలర్స్ ఫైన్ వేసింది.
హాంకాంగ్ లో ఓ పనికిమాలిన విష సంస్కృతి ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా కొంతమంది వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లోని మహిళలపై శరీర ద్రవాలను చల్లుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా ఓ పి.హెచ్.డి. విద్యార్థి ఇలాంటి పనికి పూనుకోవడంతో కోర్టు అతడికి 5వేల హాంకాంగ్ డాలర్స్ ఫైన్ వేసింది.
అవును... ప్రస్తుతం హాంకాంగ్ లో ఓ విష సంస్కృతి మొదలైంది. ఇందులో భాగంగా... మహిళలపై శరీర ద్రవాలను చల్లుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కొంతమంది వ్యక్తులు. ఈ క్రమంలో తాజాగా ఓ పీ.హెచ్.డీ విద్యార్థి 26ఏళ్ల లై చాంగ్ వే.. బిల్డింగ్ లోని ఎస్కలేటర్ పై ఉన్న ఓ మహిళ వెనుక భాగంలో తన వీర్యం కలిపిన నీటిని చల్లాడు.
ఈ వ్యవహారం కోర్టుకి వెళ్లడంతో... పీ.హెచ్.డీ. విద్యార్థికి తన నేరపూరిత బాధ్యతను అధిగమించే ధైర్యం ఉందని.. అతడి క్లీన్ క్రిమినల్ రికార్డును కూడా గమనించి 5,000 హాంకాంగ్ డాలర్స్ జరిమానా విధించినట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. వాస్తవానికి హాంకాంగ్ లో అసభ్యకరమైన దాడికి గరిష్టంగా 10ఏళ్లు జైలు శిక్ష విధించబడుతుంది.
కాగా... జూలైలో హాంకాంగ్ నిర్మాణ కార్మికుడు ఒకరు మహిళల పిరుదులపై ద్రవాన్ని చల్లాడు. దీంతో.. అతడికి నలుగు నెలల జైలు శిక్ష విధించారు. ఈ తరహా ఘటనలు 2004లోనే మొదలైనట్లు చెబుతున్నారు. ఆ ద్రవాన్ని కొంతమంది నీరు అని చెప్పగా, ఇంకొంతమంది మూత్రం వాసన వచ్చినట్లు తెలిపారు. ఇంకొంతమంది వీర్యం కావొచ్చని అన్నారు.