బ్యాంకాక్ లో ఘోరం గురించి తెలిస్తే కన్నీళ్లే

సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుసుకుంది.

Update: 2024-10-01 12:14 GMT

థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముక్కుపచ్చని చిన్నారులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు అగ్నిప్రమాదం బారిన పడింది. మంటల్లో చిక్కుకున్న వారిలో పాతిక మంది చిన్నారులు మంటల్లో కాలిపోయిన వైనం షాకింగ్ గా మారింది. ఈ దారుణ ప్రమాదం గురించి థాయ్ మంత్రి ఒకరు వెల్లడించారు. సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 44 మంది చిన్నారులు ప్రయాణిస్తున్నారు. బస్సులో స్కూలు విద్యార్థులతో పాటు వారి టీచర్ కూడా ఉన్నారు. మొత్తం 44 మందితో బస్సు ప్రయాణిస్తుండగా.. వీరిలో 38 మంది విద్యార్థులు.. ఆరుగురు టీచర్లు ఉన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిలో పదహారు మంది విద్యార్థుల్ని.. ముగ్గురు టీచర్లను మాత్రంరక్షించగలిగారు.

మిగిలిన వారి విషయంపై స్పష్టత లేదని చెబుతున్నా.. దాదాపు పాతిక మంది వరకు ఈ ఘోర అగ్నిప్రమాదంలో మరణించి ఉంటారని చెబుతున్నారు. అయితే.. మరణించిన వారి సంఖ్యను ఆయన ధ్రువీకరించటం లేదు. ఘోర ప్రమాదం జరిగిన చోట దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న ఆయన.. విచారణ పూర్తి అయ్యాక మిగిలిన వివరాల్ని వెల్లడిస్తామని చెబుతున్నారు. అయితే.. ప్రమాదం జరిగి గంటలు కావొస్తున్నా.. వివరాలు వెల్లడించకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయిన వారి డెడ్ బాడీలు బస్సులోనే ఉన్నట్లుగా చెబుతున్నారు.

బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల వయసు.. వారి విద్యార్హతకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి వస్తోంది. ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న దాని ప్రకారం ఒక టైరు పేలిపోయినట్లుగా చెబుతున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఒక సంస్థకు చెందిన వారు తాము పది మంది డెడ్ బాడీలను చూసినట్లుగా చెబుతున్నారు.స్కూల్ బస్సులో మంటలు చెలరేగి ఇంత పెద్ద ఎత్తున ప్రాణాలు పోవటంపై దిగ్భాంత్రి వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News