అమెరికాలో కూడా రిగ్గింగ్... దేశీ పాలిటిక్స్!

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పీక్స్ కి చేరిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-10-30 06:10 GMT

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పీక్స్ కి చేరిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నవంబర్ 5న జరగననున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా దొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ లు బరిలో ఉన్నారు.. ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. ఈ సమయంలో రిగ్గింగ్ విషయం ఒకటి తెరపైకి వచ్చింది.

అవును... దేశం ఏదైనా, రాజ్యం ఎంతటిదైనా ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు వచ్చాయంటే రెగ్యులర్ గా వినిపించే వార్తలు, జరిగే సంఘటనలకు అమెరికా ఏమీ అతీతం కాదన్నట్లుగా పలు సంఘటనలు ఈ ఎన్నికల్లో తెరపైకి వస్తున్నాయి! ఇందులో భాగంగా.. ఇప్పటికే అమెరికాలోని పలు ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులకు నిప్పు పెట్టారు దుండగులు.

ఈ ఘటనలపై స్పందించిన అధికారులు... మండే స్వభావం ఉన్న పదార్థాలను బ్యాలెట్ బాక్సుల కింద అమర్చడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని వెల్లడించారు. చట్టబద్ధంగా, నిస్పక్షపాతంగా జరిగే ఎన్నికలకు అంతరాయం కలిగించే ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తామని వెల్లడించారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా రిగ్గింగ్ జరిగిందనే విషయం తెరపైకి వచ్చింది.

ఈ సందర్భంగా... పెన్సిల్వేనియా, యార్క్ కౌంటీలో ఓ థర్డ్ పార్టీ నుంచి వేలకొద్దీ మోసపూరిత ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్స్, మెయిల్ ఇన్ బ్యాలెట్ అప్లికేషన్లు వస్తున్నాయని.. ఈ క్రమంలో.. లాంకాస్టర్ లో 2,600 ఫేక్ బ్యాలెట్ ఫామ్స్ కన్నా ఇవి ఎక్కువని.. వీటిని ఫిల్ చేసింది ఒక్కరే అంటూ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంఫ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఇలా... ఎలక్షన్స్ ఆఫీసులో మోసపూరితంగా అనుమానిస్తున్న ఓటరు నమోదు ఫారమ్ లు డ్రాప్ అయ్యాయి అనే వ్యవహారంపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై లాంకాస్టర్ డిస్ట్రిక్ట్ అటార్నీ హీథర్ ఆడమ్స్ మాట్లాడుతూ... పరిశీలించిన దరఖాస్తుల్లో 60శాతం మోసపూరితమైనవని తేలిందని అన్నారు.

మిగిలిన వాటిని ఈ వారాంతంలోపు పరిశీలిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా.. అనేక దరఖాస్తులు ఒకే చేతివ్రాతతో ఫిల్ చేసినట్లు సిబ్బంది గమనించారని ఆడమ్స్ తెలిపారు. దీంతో... అగ్రరాజ్యం అమెరికాలో రిగ్గింగ్ అనే వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News