ట్రంప్ వర్సెస్ కమలా తొలి డిబేట్ లో ఎవరేమన్నారంటే?

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ - కమలా మధ్య తొలి డిబేట్ మొదలైంది. ఇరువురు మధ్య మాటల యుద్ధం సాగింది.

Update: 2024-09-11 04:52 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ - కమలా మధ్య తొలి డిబేట్ మొదలైంది. ఇరువురు మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటంలో పోటీ పడ్డారు. తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. నేషనల్ కాన్ స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరిగిన తొలి డిబేట్ లో.. ఇరువురు అభ్యర్థులు పరస్పర నిందలకు పాల్పడ్డారు. ప్రజాస్వామ్యం మీద ట్రంప్ దాడి చేశారని.. అమెరికాను సమస్యల్లో వదిలేశారని కమలా హారిస్ పేర్కొనగా.. ట్రంప్ ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. ట్రంప్ మరోసారి ఎన్నికైతే చిక్కులేనని పేర్కొన్నారు.

అయితే..అమెరికాను నెంబర్ వన్ గా నిలపటమే తన లక్ష్యంగా ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో హరిస్ వద్ద దేశం కోసం ఎలాంటి ప్రణాళికలు లేవని విమర్శించారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు హారిస్. అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ చిన్నాభిన్నం చేశారని.. ఆయన హయాంలో దేశం ద్రవ్యలోటును ఎదుర్కొన్నట్లుగా మండిపడ్డారు. ట్రంప్ చేసిన తప్పుల్ని తాను.. బైడెన్ సరి చేశామని.. ట్రంప్ పాలనలో పారదర్శకత లేదన్నారు.

అమెరికాను చైనాకు అమ్మేశారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన హారిస్.. తాము చిరు వ్యాపారులు.. కుటుంబాలకుసాయం చేశామన్నారు. అందుకు భిన్నంగా ట్రంప్ మాత్రం బిలియనీర్లకు.. కార్పొరేట్లకు పన్నులు తగ్గిస్తారన్నారు. ట్రంప్ విధానాలతో అమెరికాకు 5 ట్రిలియన్ డాలర్ల లోటు ఏర్పడుతుందన్నహారిస్.. ర కీలక వ్యాఖ్య చేశారు. మహిళల డెవలప్ మెంట్ నచ్చదన్నారు. ట్రంప్ అధ్యక్షుడైతే అబార్షన్ బ్యాన్ మీద సంతకం చేస్తారని.. గర్భ విచ్ఛిత్తిపై మహిళలే నిర్ణయం తీసుకోగలరన్నారు.

అమెరికా ప్రజలు స్వేచ్ఛా ప్రియులని.. స్టార్టప్ ల కోసం పన్నులు తగ్గించేందుకు తమ వద్ద ప్రణాళికులు ఉన్నట్లు పేర్కొన్నారు. కమలా మాటలకు ట్రంప్ రియాక్టు అయ్యారు. ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా కాలంలో తాను దేశ ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టానని.. తన హయాంలో అమెరికాలో ద్రవ్యోల్బణం లేదన్నారు. కానీ.. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం అమెరికాను చీల్చి చెండాడుతోందన్నారు.

కమలా హారిస్ పెద్ద మర్స్కిస్ట్ అని.. బైడెన్ - హారిస్ ఇద్దరు కలిసి అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని వర్గాలకు విపత్తుగా మారిందని.. గర్భ విచ్ఛిత్తిపై నిషేధానికి తాను అనుకూలం కాదని స్పష్టం చేశారు. ఆ బిల్లుపై తాను సంతకం చేయనన్న ట్రంప్.. తొమ్మిదో నెలలో గర్భవిచ్ఛిత్తి అంగీకారం కాదని తేల్చారు.

తన మధ్యతరగతి నేపథ్యాన్ని ప్రస్తావించిన హరీస్.. ఓటర్ల మనసుల్లో ఎక్కువగా ఉన్న సమస్య జీవన వ్యయమేనని.. వాటిని తప్పనిసరిగా పరిష్కరిస్తామని చెబుతూనే.. బిలియనీర్లు.. పెద్ద కంపెనీలపై పన్నుల భారాల నుంచి ఉపశమనం తగ్గిస్తామన్నారు. ఇదిలా ఉంటే హరీస్ పై ట్రంప్ విమర్శలు సంధిస్తూ.. ఇమ్మిగ్రేషన్ విధానంలో బైడెన్ సర్కారు ఫెయిల్ అయ్యిందన్నారు. కమలా హారిస్ పై పదునైన విమర్శలు చేసిన ట్రంప్ వ్యాఖ్యలకు ఆమె స్పందిస్తూ.. ట్రంప్ చెప్పవన్నీ పచ్చి అబద్ధాలుగా అభివర్ణించారు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు క్రియేట్ చేసిన గందరగోళాన్నిసరి చేయటమే సరిపోయిందన్నారు.

తమ పాలనను తప్పు పట్టిన ట్రంప్ కు కౌంటర్ ఇచ్చిన హారిస్.. ‘‘ట్రంప్ ఏం ఇచ్చారో మాట్లాడుకుందాం. ట్రంప్ మనకు మహా ఆర్థిక మాంద్యాన్ని ఇచ్చారు. తీవ్రమైన నిరుద్యోగం.. ఒక శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య మహమ్మారి సమస్యను అందించి వెళ్లారు. అంతర్యుద్ధం తర్వాత మన ప్రజాస్వామ్యంపై అత్యంత దారుణమైన దాడిని ట్రంప్ మిగిల్చి వెళ్లారు. ’’ అని పేర్కొన్నారు. దీనికి బదులుగాట్రంప్ మాట్లాడుతూ.. కరోనా వేళలో తాను చాలా గొప్పగా పోరాడమని చెప్పారు.

ట్రంప్ ర్యాలీలు జనాలకు బోర్ కొడుతుందన్న హారిస్.. అందుకే ప్రజలు ఆయన ర్యాలీలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. దీనికి రియాక్టుఅయిన ట్రంప్.. ఒమియోలో హైతీ వలసదారులు కుక్కలను తినటం కుట్రు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ట్రంప్ మాట్లాడటం మొదలు పెట్టగా.. దానికి చెక్ చెప్పేలా హారిస్ నవ్వటం గమనార్హం. మొత్తంగా తొలి డిబేట్ హోరాహోరీగా సాగింది.

Tags:    

Similar News