బైడెన్ కు బ్యాడ్ న్యూస్... ఊహించని బాంబు పేల్చిన ట్రంప్!
ఈ నేపథ్యంలో బైడెన్ క్షమాబిక్షలపై ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.;
జనవరి నెలలో అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగకముందు, తన పదవీకాలం ముగిసేలోపు జో బైడెన్ సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తన కుమారుడు హంటర్ బైడెన్ పై అక్రమ ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసులు ఉండగా.. వాటిలో క్షమాభిక్ష ప్రసాదించిన సంగతి తెలిసిందే.
దీంతో... ఆ నిర్ణయం నాడు తీవ్ర సంచలనంగా మారింది. ఇదే సమయంలో సుమారు 1,500 మంది ఖైదీలకు శిక్ష తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఒకే రోజు ఈ స్థాయిలో క్షమాభిక్షలు కల్పించడం అమెరికా ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి అనే చర్చ నాడు బలంగా నడిచింది. ఈ నేపథ్యంలో బైడెన్ క్షమాబిక్షలపై ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
అవును... బైడెన్ సర్కార్ చివరి రోజుల్లో రికార్డ్ స్థాయిలో క్షమాభిక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ విషయాలపై ట్రంప్ తాజాగా ట్రూత్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇందులో భాగంగా.. గత అధ్యక్షుడు వీటికి సంబంధించిన ఆదేశాలపై ఆటోపెన్ తో సంతకాలు చేశారని.. వాటిని ఆయనకు తెల్లియకుండానే అమలుచేశారని అన్నారు.
ఈ సందర్భంగా... నిద్రమత్తులో రాజకీయ దుండగులు చాలామందికి బైడెన్ క్షమాభిక్షలు ప్రసాదించారని.. అవి చెల్లనివని, శూన్యమని, అవి ఎలాంటి ప్రభావం చూపవని తాను ఇప్పుడు ప్రకటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఎందుకంటే.. అవి ఆటోపెన్ తో చేసినవని.. ఒక్కమాటలో చెప్పాలంటే.. బైడెన్ వాటిపై సంతకం చేయలేదని అన్నారు.
అసలు ఈ విషయం కూడా బైడెన్ కు తెలియదని.. ఈ వ్యవహారం నడిపినవారు నేరం చేశారని.. వారు అత్యున్నతస్థాయి దర్యాప్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థం చేసుకోవాలని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో హెచ్చరించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. బైడెన్ కుమారుడి పరిస్థితి ఇప్పుడు ఏమిటనేది ఆసక్తిగా మారింది!
కాగా... జో బైడెన్ తన కుమారుడు హంటర్ కి క్షమాభిక్షను ప్రసాదించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం వెకేషన్ కోసం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. మరి అతని విషయంలో ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి!