స్టార్స్ మెచ్చిన ట్రంప్ టవర్స్... భారత్ లో డిమాండ్ ఎలా ఉందంటే..?

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ భారత్ లో ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం ఊపందుకుంటుందని అంటున్నారు.

Update: 2024-11-01 02:30 GMT

నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఈ మాజీ ప్రెసిడెంట్ ఎలాంటి ఫలితాన్ని పొందబోతున్నారో తెలియదు కానీ.. భారత్ లో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం పెద్ద ఎత్తున ఊపందుకుంటుంది.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ భారత్ లో ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం ఊపందుకుంటుందని అంటున్నారు. ఇందులో భాగంగా... "ట్రంప్ టవర్స్" పేరుతో విలాసవంతమైన ఆస్తులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే పూణే, ముంబైలలో రెండు ట్రంప్ టవర్లు పూర్తి అయ్యాయి.

మరో రెండు టవర్లను కోల్ కతా, గురుగ్రాం లలో నిర్మాణంలో ఉన్నాయి. వాస్తవానికి ట్రంప్ బ్రాండ్ కోసం అంతర్జాతీయ మార్కెట్ లలో భారత్ ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కనీసం నాలుగు టవర్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పూర్తయిన ప్రాజెక్టుల ధరలు రూ.10.40 కోట్ల నుంచి రూ.19.05 కోట్ల మధ్య ఉంటాయని అంటున్నారు.

వాస్తవానికి ట్రంప్ చుట్టూ వివాదాలు ఉన్నప్పటికీ అతని లగ్జరీ బ్రాండ్స్ సంపన్న భారతీయులు, అధిక నికర విలువ గల వ్యక్తులు, ఎన్నారైలను ఆకర్షిస్తూనే ఉంది. వీటిపై స్పందించిన మార్కెట్ నిపుణులు... ట్రంప్ టవర్స్ లో అమ్మకాలు సంవత్సరాలుగా చాలా స్థిరంగా ఉన్నాయని, సంపన్న కస్టమర్స్ నుంచి అధిక డిమాండ్ ఉందని అంటున్నారు.

ఇక.. భారతదేశ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి చెందడంతో ఈ ఆస్తులు గతంలో కంటే వేగంగా అమ్ముడవుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనె బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా పూణేలో ట్రంప్ ఆస్తిని కలిగి ఉన్నాడని.. ఇదే సమయంలో పలువురి నటులు, క్రికెటర్లు వీటిపై ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News