రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ భేటీ.. రేవంత్ సంచలనం నిర్ణయం
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో శనివారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో శనివారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు ఈ సమావే శాలు జరిపించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని నియమించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించను న్నారు. కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంత వరకూ అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.
మైనారిటీకి పెద్దపీట
నిజానికి తెలంగాణలో ప్రొటెం స్పీకర్ ఎవరన్నదానిపై చర్చలు బాగానే జరిగాయి. సీనియారిటీ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంది. దీనిపైనా అనేక కథనాలు వచ్చాయి. ఆయన ఏకంగా.. ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ ఇంతలోనే బాత్రూంలో కాలు జారి గాయాల పాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో కేసీఆర్ ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టింది.
అదేసమయంలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు. ఇక కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కానీ వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే.. మిగిలిన వారిని ఎంపిక చేయకుండా.. మైనారిటీలకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన రేవంత్ ప్రభుత్వం అనూహ్యంగా ఎంఐఎం పార్టీకి చెందిన చంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేయడం గమనార్హం. ఇది ఓవైసీలకు దక్కిని తొలి అవకాశం కావడం గమనార్హం.