ఏపీ అసెంబ్లీలో.. స్వాతంత్ర్య పూర్వం జన్మించిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పెషల్

చరత్రిలో ఎన్నడూ లేనివిధంగా 90 శాతం పైగా ఒకే కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ఉన్నారు.

Update: 2024-06-22 10:58 GMT

షెడ్యూల్, నోటిఫికేషన్, ప్రచారం, పోలింగ్, ఫలితాల వెల్లడి, ప్రభుత్వం ఏర్పాటు.. ఎమ్మెల్యేల ప్రమాణం.. ఆఖరికి స్పీకర్ ఎన్నిక.. ఏపీలో అన్నీ పూర్తయిపోయాయి. కొత్త సర్కారు తొలి మంత్రివర్గ సమావేశం కూడా జరగనుంది. కాగా, ఏపీలో మొత్తం 175 సీట్లున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 సీట్లు గెలుచుకుని రికార్డు నెలకొల్పింది. గత ఎన్నికల్లో 151 స్థానాలు నెగ్గి అధికారంలోకి వచ్చిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది.

ఎటు చూసినా కూటమి ఎమ్మెల్యేలే..

చరత్రిలో ఎన్నడూ లేనివిధంగా 90 శాతం పైగా ఒకే కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ఉన్నారు. దీంతో ఎటుచూసినా వారే కనిపిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీకి 11 మందే ఉండడం.. అందులో శనివారం ఒక్కరే సభకు హాజరుకావడంతో అంతా కూటమి ఎమ్మెల్యేలే కనించారు.

అత్యంత సీనియర్లు వీరే..

ఏపీ ప్రస్తుత అసెంబ్లీలో అత్యధికంగా ఎన్నికల్లో గెలిచినది సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే, ఆయన వయసు 74. కేవలం 28 ఏళ్ల వయసులోనే తొలిసారి చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. దీంతో 8సార్లకు పైగా గెలిచారు. ఇక వయసు పరంగా చూస్తే మాత్రం ఏపీ అసెంబ్లీలో అత్యంత పెద్దవారు మాత్రం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి. ఈయన 1942 నవంబరు 12న జన్మించారు. అంటే.. దాదాపు 82 ఏళ్లు. మరో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈయన 1946 మార్చి 15న పుట్టారు. ప్రస్తుత వయసు 78. వీరిద్దరూ చంద్రబాబు కంటే వయసులో పెద్దవారు. అంతేకాదు.. స్వాతంత్ర్యానికి పూర్వం జన్మించి.. ప్రస్తుత అసెంబ్లీ ఉన్నది వీరిద్దరే.

20 ఏళ్ల తర్వాత..

నంద్యాల వరద రాజులురెడ్డి టీడీపీ తరఫున ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరులో 1985 నుంచి 2004 వరకు వరుసగా ఐదు సార్లు నెగ్గారు. 2009లో మాత్రం మల్లెల లింగారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రెండుసార్లు ఆయన శిష్యుడు. వైసీపీ అభ్యర్థి అయిన రాచమల్లు శివప్రసాదరెడ్డి చేతిలో పరాజయం ఎదుర్కొన్నారు. కాగా, ఈసారి శివప్రసాదరెడ్డిని ఓడించి.. 20 ఏళ్ల తర్వాత గెలుపును చూశారు. చివరగా ఉమ్మడి ఏపీలో శాసన సభ్యుడిగా పనిచేసిన వరదరాజులురెడ్డి ఇప్పుడు విభజిత ఏపీలో గెలిచారు.

మంత్రి పదవి దక్కని బుచ్చయ్య

రాజమహేంద్రవరం రూరల్ నుంచి ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన బుచ్చయ్య చౌదరి ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన గతంలో మంత్రిగానూ వ్యవహరించారు. ఇటీవలి ఎన్నికల్లో తొలిగా గెలిచింది ఈయనే.

Tags:    

Similar News