సీఈఓ వాచ్ పోయింది... ఎవరికైనా దొరికిందా?

వీటిలో ప్రధానంగా... గత ఐదేళ్లలో లండన్‌ లో సుమారు 29,000 వాచీ దొంగతనాలు జరిగినట్లు చెబుతున్నారు

Update: 2024-02-08 23:30 GMT

లండన్ లో దొంగతనాలు వరుసగా పెరుగుతున్నాయని అంటున్నారు. ఉదాహరణకు 2022తో పోలిస్తే... 2023లో జరిగిన దొంగతనాలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. అయితే ఈ దొంగతనాలలో బాధితులుగా పలువురు సీఈఓలు ఉన్నారని తెలుస్తుంది. తాజాగా వారే ఈ విషయాలను వెల్లడించారు.. ఈ సందర్భంగా లండన్ లోని భద్రతపై సీరియస్ గా స్పందించారు. లండన్ పర్యటనకు వచ్చినప్పుడు భద్రత లేకపోతే తామెందుకు రావాలని అంటున్నారు.

అవును... తాజాగా యూకే షాడో ఫారిన్ సెక్రటరీ డేవిడ్ లామీ, భారతీయ వ్యాపారవేత్తల మధ్య జరిగిన సమావేశంలో ఆసక్తికరంగా దొంగతనాల విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... పలువురు సీఈఓలు లండన్‌ లో రోలెక్స్ వాచ్ దొంగతనాల అంశాన్ని ప్రస్తావించారు. సమావేశాలకు, వ్యాపార అవసరాల నిమిత్తం లండన్ వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లిన ఖరీదైన వస్తువులు దొంగిలిస్తున్నారని చెబుతున్నారు.

ఈ సందర్భంగా... లగ్జరీ వాచ్ లతో పాటు మొబైల్స్ ఫోన్స్, హ్యాండ్ బ్యాగులు సైతం దొంగలిస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశంలో వెల్లడించారు. ఈ మేరకు తమ తమ విలువైన వస్తువులు చాలానే పోయినట్లు పలు కంపెనీల సీఈఓలు ఆవేదన వ్యక్తం చేశారు. లండన్ పర్యటనకు వచ్చినప్పుడు భద్రత లేకపోతే మేము ఎందుకు రావాలని ప్రశ్నించారు.

కాగా... 2022తో పోలిస్తే 2023లో లండన్ లో దొంగతనాలు భారీగా పెరిగిపోయాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా 2022తో పోలిస్తే గత ఏడాదిలో దొంగతనాలు ఏకంగా 27 శాతం పెరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయని అంటున్నారు. ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలంటే... 2022లో సుమారు 52 వేల దొంగతనాలు నమోదవగా, 2023లో 72 వేలు నమోదైనట్లు మెట్రోపాలిటన్‌ పోలీసులు వెల్లడించారు.

వీటిలో ప్రధానంగా... గత ఐదేళ్లలో లండన్‌ లో సుమారు 29,000 వాచీ దొంగతనాలు జరిగినట్లు చెబుతున్నారు. దీంతో... ఈ విషయాలపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని.. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం తమ ఇబ్బందులను అర్ధంచేసుకుని, పరిగణలోకి తీసుకోవాలని వ్యాపారవేత్తలు వెల్లడించారు. దీంతో... వీటికోసం లండన్ పోలీసులు అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News