క‌ళ్యాణ‌దుర్గం టీడీపీలో క‌ల‌క‌లం.. వైసీపీలో చేరిన ఉమా!

ప్రస్తుతం టీడీపీలో తనకు అవమానం జరిగిందని భావిస్తున్న మాదినేని ఉమామహేశ్వర నాయుడు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు.

Update: 2024-03-30 15:30 GMT

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని క‌ళ్యాణ దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ టికెట్ విషయంలో విభేదాలు కారణంగా కీలకమైన నేత టీపీడీకి బై చెప్పారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన ఉమామహేశ్వర్‌నాయుడు ఇప్పుడు అదే పార్టీలో చేరారు. కళ్యాణదుర్గం నియోజ కవర్గం టిడిపిలో బలమైన క్యాడర్ ఉంది. అభ్యర్థులు ఎవరు వచ్చిన ఆ నియోజకవర్గానికి క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. అలాంటి నియోజకవర్గంలో గత కొంతకాలంగా టీడీపీ నేతల వర్గ విభేదాలు నాయకుల మధ్య పోరుతో క్యాడర్ రెండుగా చీలిపోయింది.

2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం అభ్యర్థిగా మాదినేని ఉమామహేశ్వర నాయుడు టీడీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఉషశ్రీ చరణ్ చేతిలో ఆయ‌న ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల తో కళ్యాణదుర్గంలో టిడిపి రెండు వర్గాలు చీలిపోయింది. ఈ వర్గ పోరుకు చెక్ పెట్టాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండు వర్గాలకు కూడా చెక్ పెట్టారు. అప్పటి వరకు ఇన్చార్జిగా ఉన్న ఉమామహేశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని ప‌క్క‌న పెట్టేశారు.

ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్‌ అమిలినేని సురేంద్రబాబుకు తాజా ఎన్నిక‌ల్లో కళ్యాణ‌దుర్గం టికెట్ ఇ చ్చారు. ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. చంద్ర‌బాబు నిర్ణ‌యంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఉమామ హేశ్వర నాయుడు గత కొద్ది కాలంగా పార్టీకి ఆంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. పలు మార్లు అనుచరులతో సమావేశమై చర్చించారు. ఒకానొక దశలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేయాల నే ఆలోచనకు వచ్చారు.

ప్రస్తుతం టీడీపీలో తనకు అవమానం జరిగిందని భావిస్తున్న మాదినేని ఉమామహేశ్వర నాయుడు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్ర‌మంలో శ‌నివారం తెల్ల‌వారుజామున ఉమామహేశ్వర నాయుడు ఇంటికి కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి ఎంపీ తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇతర వైసిపి నేతలు వ‌చ్చి చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో వారి పిలుపు మేర‌కు ఉమా వైసీపీ కండువా మార్చేసుకున్నారు. చిత్రం ఏంటంటే.. ప్ర‌స్తుతం ప‌క్క‌నే ఉన్న క‌డ‌ప‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్నారు.

Tags:    

Similar News