జగన్ ని ఓడించిన ఆ ఆరుగురూ ?

మహా భారతంలో ఒక పద్యం ఉంది. మహా బలుడు అత్యంత శక్తిమంతుడు అయిన కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో వీర మరణం పొందుతారు.

Update: 2024-06-15 03:57 GMT

మహా భారతంలో ఒక పద్యం ఉంది. మహా బలుడు అత్యంత శక్తిమంతుడు అయిన కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో వీర మరణం పొందుతారు. కర్ణుడు వంటి మహా వీరుడు ఓడడం మరణించడం వంటివి చూసిన వారు క్రిష్ణుడుని దీని మీద అడుగుతారు. కర్ణుడు ఎలా ఓడారు అన్న ధర్మ సందేహాన్ని వారు వ్యక్తం చేస్తారు.

దానికి శ్రీ క్రిష్ణుడు బదులిస్తాడు. అరయంగ కర్ణుడీల్గే అర్గురి చేతన్ అని అంటాడు. అంటే జన్మనిచ్చిన తల్లి కుంతి, చదువు చెప్పిన గురువు, భూమాత, బ్రాహ్మణుడు, ఇంద్రుడు, ద్రోణుడు అని చెబుతాడు. ఇది మహాభారతంలో ఆసక్తికరమైన అంశం.

మరి ఆధునిక ఆంధ్ర రాజకీయ భారతంలో జగన్ తాజా ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఆయన ఎలా ఓడిపోయారు అని అంటే దానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెబుతారు. కర్ణుడి మాదిరిగానే ఆరుగురు జగన్ ఓటమికి కారణం అయ్యారు అని అంటూ ఈ మేరకు తనకు వచ్చిన ఒక పోస్టింగ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న దాన్ని ఆయన మీడియా ముందు చదివి వినిపించారు.

అందులో ఆరుగురు ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్, జగన్ తల్లి విజయలక్ష్మి, జగన్ చెల్లెలు షర్మిల తో పాటు జగన్ సచివుడు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి అని అంటారు. ఈ విధంగా జగన్ ఓటమి మీద సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారుట.

అంటే కర్ణుడు మరణం వెనక తల్లి కుంతి ఉంటే జగన్ ఓటమి వెనక తల్లి చెల్లెలు ఇద్దరూ ఉన్నారని ఏపీలోని చైతన్యవంతులైన నెటిజన్లు భావిస్తున్నారు అన్న మాట. అంతే కాదు ఎపుడూ జగన్ తోనే ఉంటూ ఆయన నీడగా ఉండే సజ్జల రామక్రిష్ణారెడ్డి వల్ల జగన్ ఓటమి జరిగింది అని తీర్మానిస్తున్నారుట. ఇక మోడీ చంద్రబాబు పవన్ ఎటూ ఆయనకు రాజకీయంగా ఎదురు నిలిచిన ప్రత్యర్ధులు.

మొత్తం మీద చూస్తే ఎదురుగా ఉండే ప్రత్యర్ధులనే జగన్ చూసారు కానీ మిగిలిన ముగ్గురూ తనకు ప్రత్యర్ధులు అవుతారని తన దారుణ ఓటమిని వారు రాస్తారని అసలు ఊహించలేకపోయారు అని అంటున్నారు. తల్లి చెల్లెల వల్ల ఇంత ప్రభావం ఉంటుందని జగన్ అనుకోలేదు అని అంటున్నారు కానీ ఫలితాలు వచ్చిన తరువాత తెలిసింది. ఆ ప్రభావం ఎంతో. ఏకంగా కాంగ్రెస్ కి అయిదున్నర లక్షల ఓట్లు వచ్చాయి.

ఆ ఓట్లు అన్నీ వైసీపీవే. ఇక ఉద్యోగ వర్గాలతో పాటు కొన్ని కీలక వర్గాలు దూరం కావడానికి సజ్జల వైఖరి కారణం అని ప్రచారం సాగింది. ఇలా వైసీపీకి కూటమికి మధ్య తేడా ఇరవై లక్షల ఓట్లు అయితే వాటిని అంత దూరం పెంచడానికి మిగిలిన ముగ్గురూ కారకులు అని అంటున్నారు. మొత్తానికి జగన్ ఓటమి మీద రకరకాలైన విశ్లేషణాల్లో ఇది ఆసక్తికరంగా ఉంది అని అంటున్నారు. ఉండవల్లి దీనిని మీడియాలో చెబుతూ రక్తి కట్టించారు.

Tags:    

Similar News