ఇదేంటి మోడీషా?కేంద్ర మంత్రిపై సొంత పార్టీకి చెందినోళ్లే దాడి చేశారు?
ఎన్నికల వేళ.. తమ ప్రయోజనాలకు తేడా వస్తే స్థానిక నేతలు అస్సలు తట్టుకోలేరు.
ఎన్నికల వేళ.. తమ ప్రయోజనాలకు తేడా వస్తే స్థానిక నేతలు అస్సలు తట్టుకోలేరు. ఇక.. పార్టీ తీసుకునే కొన్ని నిర్ణయాల పట్ల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు.తాము కోరుకున్న నేతలకు టికెట్లు దక్కని పరిస్థితుల్లో.. తామెంతో ప్రేమించి.. అభిమానించే పార్టీ విషయంలోనూ రచ్చ రచ్చ చేస్తారు. టికెట్ ఆశించినప్పటికి తాము కోరుకున్న నేతలకు దక్కకపోతే వారి ఆగ్రహం ఎంతలా ఉంటుందన్న విషయం తాజాగా బీజేపీ అధినాయకత్వానికి అర్థమై ఉంటుంది.
తాజాగా జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్ లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు బీజేపీ తన అభ్యర్థులకు సంబంధించి ఐదు జాబితాల్ని విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో 92 మంది అభ్యర్థులు ఉన్నారు.
అయితే.. ఈ జాబితాలో తాము ఆశించిన వారికి టికెట్లు రాకపోవటంపై కార్యకర్తలు.. పార్టీ సానుభూతిపరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జబల్ పూర్ నార్త్ సెంట్రల్ అసెంబ్లీ నియోకవర్గం నుంచి అభిలాష్ పాండే అభ్యర్థిగా నిలబెట్టారు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
మాటలు కాస్త శ్రుతిమించి రాగా పడిన వేళ.. సహనం కోల్పోయిన కార్యకర్తులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది పార్టీ కార్యకర్తల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. మొత్తంగా కేంద్ర మంత్రి భూపేంద్రకు తాజాగా చోటు చేసుకున్న పరిణామం షాకిచ్చేలా మారిందని చెప్పక తప్పదు.