బీజేపీకి 'బీపీ' లేపుతున్న 'యూపీ'

కానీ ఈ సారి ఎన్నికలలో అనూహ్యంగా తక్కువ స్థానాలకు మాత్రమే ఎన్డీఎ కూటమి పరిమితం అవుతున్నది.

Update: 2024-06-04 05:02 GMT

అయోధ్య రాముడి ఆశీస్సులతో ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలకు గాను 75 స్థానాలను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరిన బీజేపీ ఆశల మీద యూపీ ఓటరు నీళ్లు చల్లారు. 2019 ఎన్నికలలో 80 స్థానాలకు గాను ఎన్డీఎ కూటమి 64 స్థానాలను గెలుచుకోగా, విపక్షాలు కేవలం 16 స్థానాలకు పరిమితం అయ్యాయి. కానీ ఈ సారి ఎన్నికలలో అనూహ్యంగా తక్కువ స్థానాలకు మాత్రమే ఎన్డీఎ కూటమి పరిమితం అవుతున్నది.

ఈ ఎన్నికల్లో ప్రస్తుతం బీజేపీ 37 స్థానాలలో ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, ఇండియా కూటమి 43 స్థానాలలో అధిక్యం ప్రదర్శిస్తుండడం గమనార్హం. అనూహ్యంగా మొదటి రౌండులో స్వయంగా ప్రధాని మోడీ మొదటి రౌండ్ లో 600 ఓట్ల అధిక్యానికి పరిమితం కావడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై 17 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.

ఇక రాయ్ బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ పై రాహుల్ గాంధీ 28,826 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ కన్నా 15,060 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. లక్నోలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ 8207 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తానికి యూపీలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి బీపీ రేపుతున్నాయి.

Tags:    

Similar News