ప్రేయసి కోసం పాక్ కు వెళ్లాడు.. పోలీసులకు చిక్కాడు
ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కు చెందిన 30 ఏల్ల బాదల్ బాబుకు పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన మహిళ ఫేస్ బుక్ లో పరిచయమైంది.
ప్రేమ ఏమైనా చేయిస్తుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక యువకుడు ఆన్ లైన్ లో తనకు పరిచయమై.. ప్రేయసిగా మారిన వేళ.. ఆమెను ఏదోలా కలుసుకోవాలన్న తలంపుతో ఏకంగా దేశ సరిహద్దుల్ని అక్రమంగా దాటేశాడు. ఈ క్రమంలో పాక్ పోలీసులకు చిక్కి.. ఇప్పుడు జైలుపాలయ్యాడు. ఈ వీర ప్రేమికుడి గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కు చెందిన 30 ఏల్ల బాదల్ బాబుకు పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన మహిళ ఫేస్ బుక్ లో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది దీంతో.. ప్రేయసిని కలిసేందుకు భారీ ప్లాన్ వేశాడు. అక్రమంగా దేశ సరిహద్దుల్ని దాటేసి.. పాకిస్థాన్ కు వెళ్లాడు. అక్కడ ప్రేయసిని కలిసినప్పుటికి.. పాక్ పోలీసులకు చిక్కాడు. దీంతో.. అతడ్ని కోర్టు ఎదుట హాజరుపర్చగా.. పద్నాలుగు రోజులు జైలుశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే.. బాదల్ బాబుకు ఇలా పాకిస్థాన్ లోని ప్రేయసిని కలుసుకోవటానికి అక్రమ మార్గాన్ని ఎంచుకోవటం కొత్తేం కాదు. గతంలో రెండుసార్లు ఇలానే వెళ్లి ప్రేయసిని కలవకుండానే దొరికిపోయాడు. తాజాగా మాత్ం ప్రేయసిని కలవలిగాడు. కాకుంటే అక్కడి పోలీసులకు బహుద్దీన్ పట్టణంలో దొరికిపోయాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని జైలుక తరలించారు. ఇదంతా డిసెంబరు 27న జరగ్గా.. కాస్త ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. బాదల్ బాబు అక్రమ ప్రవేశంపై పాక్ పోలీసులు మరింత లోతుగా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగానే ప్రేయసి కోసమే పాక్ కు వచ్చాడా?. ఇంకేమైనా కారణం ఉందా?. అన్న అంశంతో పాటు.. సరిహద్దుల్ని ఎలా దాటాడు? అతడికి సహకారం ఎవరు ఇచ్చారు? అన్న అంశాల మీదా విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.