నేను ఒంటరిగా ఉండలేక పోతున్నా: వంశీ
విజయవాడలోని జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ.. తాను జైల్లో ఒంటరిగా ఉండలేకపోతున్నట్టు చెప్పారు.;
విజయవాడలోని జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ.. తాను జైల్లో ఒంటరిగా ఉండలేకపోతున్నట్టు చెప్పారు. తనకు అసిస్టెంట్‌గా ఎవరినైనా నియమించాలని ఆయన అభ్యర్థించారు. తనకు ఆస్తమా ఉందని.. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియదని వంశీ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో జైలులో తనకు రక్షణగా మరొకరిని నియమించాలని ఆయన కోరారు.
తాజాగా మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు వంశీని కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ సంద ర్భంగా తన వాదనను వంశీ వినిపించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని.. ఆస్తమా ఉందని తెలిపారు. ప్రస్తు తం తను ఉంటున్న బ్యారక్‌లో ఒంటరిగా ఉండాల్సి వస్తోందని.. ఏదైనా జరగరానిది జరిగితే.. తన ప్రాణా లకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో తనకు మరింత రక్షణ కల్పించాలన్నారు.
ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని.. ఇప్పటికే ఒక వ్యక్తిని సంరక్షణగా ఉంచుతున్నట్టు తెలిపింది. మరొకరిని నియమించే అధికారం తమకు లేదని న్యాయాధికారి తెలిపారు. ఈ విషయాన్ని జైలు అధికారు లు పర్యవేక్షించాలన్నారు. వంశీకి ఏదైనా జరిగితే.. అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్న న్యాయాధికారి.. ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అనంతరం.. విజయవాడ జైలుకు తరలించారు.
మళ్లీ కస్టడీ!
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీ సహా పలువురిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ ఖైదీలుగా జైలుకు తరలించారు. అనంతరం.. మూడు రోజుల కస్టడీకి తీసుకు ని.. కిడ్నాప్, బెదిరింపులపై ఆరా తీశారు. అయితే.. వంశీ సహా ఇతర నిందితులు సరైన సమాధానం చెప్ప లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు వారిని కస్టడీకి కోరనున్నట్టు చెప్పారు. దీనిపై కస్టడీ పిటిషన్ శుక్రవారం దాఖలు చేయనున్నట్టు వివరించారు.