పవన్ భార్యను అన్నప్పుడు వీరంతా ఎందుకు స్పందించలేదు?

సీనియర్ టీడపీ నేత వంగలపూడి అనిత రియాక్టు అయ్యారు. రోజాకు మద్దతుగా స్పందిస్తున్న సినీ లోకం.. ఆ రోజున పవన్ కల్యాణ్ భార్యను అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు?

Update: 2023-10-09 12:30 GMT

ఏపీ మంత్రి ఆర్కే రోజాపై నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. బండారు మీద వైసీపీ వర్గాల కంటే కూడా సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటీమణులు పెద్ద ఎత్తున రియాక్టు కావటం.. బండారుపైన తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆర్కే రోజా వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు పలువురు రియాక్టు అవుతున్న దానిపై కొందరు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యర్థులపై రోజా చేసే వ్యాఖ్యలను వారు ప్రస్తావిస్తున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా ఏపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు.. సీనియర్ టీడపీ నేత వంగలపూడి అనిత రియాక్టు అయ్యారు. రోజాకు మద్దతుగా స్పందిస్తున్న సినీ లోకం.. ఆ రోజున పవన్ కల్యాణ్ భార్యను అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? అని సూటిగా ప్రశ్నించారు. రోజా చరిత్ర ఏమిటో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని.. లేదంటే ప్రజలనుంచి ఛీత్కారాలు తప్పవన్నారు.

రోజా - బండారు ఎపిసోడ్ లోకి పవన్ ప్రస్తావనను తీసుకొచ్చిన వంగలపూడి వ్యాఖ్యలపై జనసేన వర్గాలు శాంతిస్తున్నాయి. కారణం.. రోజా మీద బండారు వ్యాఖ్యల ఎపిసోడ్ లో టీడీపీ పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కొంటోంది. నిత్యం మర్యాదల గురించి పాఠాలు చెప్పే పార్టీకి చెందిన నేత.. మహిళా నేత గురించి ఇలా మాట్లాడితే ఖండించకుండా ఉండటం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. కౌంటర్ గా పవన్ ప్రస్తావన తీసుకురావటం ద్వారా రోజా అండ్ కో మీద ఎదురుదాడితో పాటు.. పవన్ వర్గం సైతం అంతో ఇంతో సంత్రప్తికి గురయ్యే పరిస్థితి. అయితే.. టీడీపీ నేతలు ఎవరూ ఈ ప్రస్తావన తీసుకురాని వేళ.. వంగలపూడి అనిత ఇదే పాయింట్ ను ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది. రోజాపై మాట అనటం తప్పే కానీ.. ఆమె మాట్లాడే మాటలు.. చేసే వ్యాఖ్యల్ని కూడా కాస్త పరిశీలించాలని ఆమె తరఫున మాట్లాడే వారిని సూచనలు చేస్తున్నారు.

Tags:    

Similar News