పొలిటికల్ గాసిప్ : వైసీపీ నుంచి ఆమె విడదల ?
ఈ క్రమంలో విడదల రజనీ వైసీపీని వీడుతారు అన్న ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకుంది.
వైసీపీకి రాజకీయంగా ఏమీ కలసి రావడం లేదు. అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం గట్టిగానే వైసీపీని టార్గెట్ చేస్తోంది. వైసీపీ అధినాయకత్వం చెప్పినట్లుగా ఓర్చుకోవడం ఏ నేత వల్లా కావడం లేదు. జస్ట్ అయిదేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయన్న మాటలు వైసీపీలో చాలా మంది నేతలు పట్టించుకోవడం లేదు.
అయిదేళ్ళు అంటే చాలా చూడాలని భయపడుతున్నారు. పైగా ఎక్కడికక్కడ వైసీపీ నేతలను ఆయా నియోజకవర్గాల్లో నియంత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మాజీ మంత్రి చిలకలూరిపేట కు చెందిన వైసీపీ మహిళా నాయకురాలు విడదల రజనీ మీద కేసులు నమోదు అవుతూండడంతో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ని ఆమె మాజీ మంత్రి చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు ఇచ్చారు.
అయితే అంతకు పది రెట్లు అక్కడ నుంచి ఆయన బిగ్ సౌండ్ చేశారు. దీంతో వార్ అన్నది చాలా క్లియర్ గా ఉంది అని అర్థమవుతోంది. అధికార పార్టీ దూకుడుని తట్టుకోవడం కష్టమే అన్న భావన కూడా వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో విడదల రజనీ వైసీపీని వీడుతారు అన్న ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకుంది.
ఆమె రెండు రోజుల క్రితమే జగన్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ మీటింగుకు హాజరు అయ్యారు. దాంతో ఆమె స్ట్రాంగ్ గా నిలబడతారు అని అనుకున్నారు. కానీ ఆమె జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆమె భర్తది కాపు సామాజిక వర్గం కావడంతో ఆమె కాపు కార్డు ఉపయోగించుకుని జనసేనలో చేరుతారని అంటున్నారు. రాజకీయంగా ఆమె పార్టీని మారడానికి ఈ సామాజిక అస్త్రం ముఖ్యమవుతుందని అంటున్నారు.
ఈ మేరకు వైసీపీ నుంచి జనసేనలో చేరిన కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఆమె చర్చలు జరుగుతున్నారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. జనసేనలో చేరడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కూటమి నుంచి పోటీ చేయడానికి గట్టి హామీని కోరుకుంటున్నారు.
అయితే జనసేన అప్పట్లో ఆమె మీద విమర్శలు చేస్తూ వచ్చింది. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో పాలన ఏమీ చేయలేదని కూడా కామెంట్స్ చేస్తూ వచ్చింది. అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే కాబట్టి ఆమెను చేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఆమె ఆర్ధికంగా బలవంతురాలు. అలాగే సామాజిక వర్గం పరంగా బీసీ నేత, అటు కాపు కార్డు కూడా ఉంది.
దాంతో ఆమెని తీసుకోవడానికి జనసేన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కనుక ఆమె వైసీపీ నుంచి విడుదల అవుతారు అని అంటున్నారు. విడదల రజనీ వంటి అంగబలం అర్ధబలం కలిగిన నేత పార్టీని వీడితే అది వైసీపీకి రాజకీయంగా భారీ షాక్ అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ రాజకీయ పుకారులో నిజమెంత ఉందో తేలాల్సి ఉంది.