"ఈ వ‌య‌సులో ఇదేం పాడు బుద్ధి నాన్నా"

ఇప్పుడు తన తండ్రిని ఎలా తీసుకుంటున్నారు'' అని సీఎం రేవంత్‌పైనా విప్ల‌వ్ కుమార్ ఫైర‌య్యారు.

Update: 2024-03-29 20:25 GMT

''ఈ వ‌య‌సులో ఇదేం పాడు బుద్ధి నాన్నా'' అంటూ.. తాజాగా బీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పిన కంచ‌ర్ల కేశ‌వ‌రావు త‌న‌యుడు, బీఆర్ ఎస్ నాయ‌కుడు విప్ల‌వ్ కుమార్ సొంత తండ్రిపైనే నిప్పులు చెరిగారు. ''నీ వ‌య‌సు 84 ఏళ్లు నాన్నా. ఈ వయసులో పార్టీ మారడం ఏమిటి? భ‌విష్య‌త్తులో నా పిల్ల‌ల‌కు ఏం చెప్పాలి. మీ తాత‌.. రాజ‌కీయ ప‌ద‌వుల కోసం ఆశ‌ప‌డి 84 ఏళ్ల వ‌య‌సులో గోడ దూకార‌ని చెప్ప‌డానికి మ‌న‌సు రాదు నాన్నా'' అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తన తండ్రి పార్టీని వీడటం బాధగా ఉందని విప్ల‌వ్ కుమార్ అన్నారు.

బీఆర్ ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సీనియర్ నాయకుడిగా తన తండ్రి కేసీఆర్‌కు అండగా ఉండాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం సరికాదని విప్ల‌వ్ వ్యాఖ్యానించారు. అయితే, తన తండ్రి పదవుల కోసం కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లుగా తాను భావించడం లేదని.. ఈ వయస్సులో ఆయనకు పదవులు... పోస్టులు అవసరం లేదని అన్నారు. ''కేకే తన జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అవసరం పార్టీకి ఉంది. గతంలో పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారినప్పుడు ఈ వయస్సులో పార్టీ మారడం ఏమిటి? అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తన తండ్రిని ఎలా తీసుకుంటున్నారు'' అని సీఎం రేవంత్‌పైనా విప్ల‌వ్ కుమార్ ఫైర‌య్యారు.

ఇన్నాళ్లు తమ కుటుంబం కలిసి ఉందని... కానీ రేవంత్ రెడ్డి వచ్చి విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ మార్పుపై తన తండ్రి పునరాలోచన చేయాలని విప్ల‌వ్ కోరారు. త‌న అక్క‌, మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చారని విప్ల‌వ్ చెప్పారు. పార్టీ మనకు ఇంత చేసినప్పుడు అదే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాలని సూచించా రు. ''ఆత్మగౌరవం ఉంటే పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌‌లోకి వెళ్లండి నాన్నా. నువ్వు కూడా అక్కా'' అని విప్ల‌వ్ వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ నమ్మదగిన వ్యక్తి కాదన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఆయనను చూస్తూనే ఉన్నానన్నారు. ఎప్పుడూ ఒక పార్టీలో ఉండరని విమర్శించారు.

Tags:    

Similar News