హతఃవిధీ... మందుబాబుతో శివలింగంపై ప్రమాణం!

అవును... భర్త చెడు అలవాట్లకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుంటే ఇంట్లో పెద్దలకో, ఊరి పెద్దలకో, రక్త సంబంధీకులకో చెప్పకుండా కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-09-23 02:45 GMT

ధూమపానం.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం..! తప్పు అమ్ముతున్న ప్రభుత్వాలదా - తాగుతున్న మందుబాబులదా? కోడి ముందా.. గుడ్డు ముందా..? అనే ప్రశ్నలాగానే ఇది కూడా ఉంటుంది! అయితే మద్యాన్ని వైద్యుల సూచనల మేరకు, పరిధిలో అప్పుడప్పుడూ తీసుకుంటే మంచిది అని చెప్పే మాటల సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ అలవాటుకు బానిసై, ఉదయం లేచింది మొదలు రాత్రి ఎలా, ఎక్కడ నిద్రపోతున్నామో తెలియనంతగా తాగేసే అలావాటు అత్యంత ప్రమాధం.

చాలా మంది చెప్పేమాట... మద్యం నీకు బానిసవ్వాలి కానీ, మద్యానికి నువ్వు బానిసవి అవ్వకూడదు అని! అంటే... ఎప్పుడైనా నువ్వు కావాలి అనుకుంటే అది నీ కాళ్లదగ్గరకు రావాలి తప్ప... ఉదయం లేవగానే నువ్వు దాని కాళ్లదగ్గరకి వెళ్లకూడదని! అలాకాకుండా మద్యానికి బానిసై తన బ్రతుకుతోపాటు కుటుంబాన్ని, పిల్లల బ్రతుకుని నాశనం చేస్తూ... కన్నోళ్లకీ, కట్టుకున్నోళ్లకీ కన్నీటిని మిగిలిస్తూ బ్రతికితే మాత్రం ఈ లోకంలో అంతకు మించిన తప్పుడు పని మరొకటి ఉండదని అంటుంటారు.

ఈ ఉపోద్ఘాతం సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా ఓ మందుబాబు వల్ల ఇబ్బందులు పడుతున్న ఒక ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా శివలింగం మీద ప్రమాణం చేయించాలని ఫిక్సయ్యింది. అనుకున్నదే తడవుగా ఆ మందుబాబుని దేవాలయం వరకూ తీసుకెళ్లగలిగారు అప్పుడు జరిగింది అసలు సంగతి... ఈయన ప్రమాణం, పంతులు మంత్రాల సందడి ఆ లెక్కే వేరన్నట్లుగా సాగింది.

అవును... భర్త చెడు అలవాట్లకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుంటే ఇంట్లో పెద్దలకో, ఊరి పెద్దలకో, రక్త సంబంధీకులకో చెప్పకుండా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా... గ్రామంలో ఉన్న దేవాలయానికి తీసుకెళ్లి శివలింగంపై చేయి వేయించి ప్రమాణం చేయించింది. ఓ పూజారి మంత్రాల స్టైల్లో చదువుతుండగా ఆ వ్యక్తి ప్రమాణం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

"రమ్ము, జిన్ను, బీరు, బీజర్, ఓడ్కా, గుట్కా, గుడుంబా, తాటి కల్లు, ఈత కల్లు, తాటి చిగురు, ఈత చిగురు, ఇప్ప సారా.. మొదలగు మత్తుపానీయాలు నేటి నుంచి 5 సంవత్సరముల కాలంలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగనని.. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా.. నాకు పిల్లనిచ్చిన అత్తమామల సాక్షిగా.. నేను పెళ్లి చేసుకున్న నా భార్య సాక్షిగా.. నేను జన్మనిచ్చిన నా పిల్లల సాక్షిగా రాచపూడి గ్రామంలో వెలసిన ఉన్న పరమేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అని ఆ వ్యక్తితో ప్రమాణం చేయించాడు.

దీంతో... ఇందులో ఎవరి బలవంతం లేదని అతని చేత పూజారి ఒప్పించడం ఒక హైలెట్ అయితే... ఆ సమయంలో ఆ మందుబాబు ఊగుతూ ప్రమాణం చేయడం మరొకెత్తు. ఈ నేపథ్యంలో "ఇంతటి కష్టం పగోడికి కూడా రాకూడదు" అని కొందరు కామెంట్ పెడుతుంటే... "ప్రతీ మందుబాబు భార్యా ఇలాంటి ఆలోచన చేస్తే అబ్కారీ శాఖ దివాలా ఖాయం" అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News