ఏ టీవీ ఏ పార్టీ.. ఏ ఛానెల్‌ది ఏ దారి? .. కేంద్రం న‌జ‌ర్‌!

దీనికి దూర‌ద‌ర్శ‌న్ ప్రాంతీయ విభాగాలైన యాద‌గిరి(తెలంగాణ‌), స‌ప్త‌గిరి(ఏపీ)ల ద్వారా సంపూర్ణ స‌మాచా రాన్ని యుద్ధ ప్రాతిప‌దికన సేక‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Update: 2023-10-21 14:30 GMT

ఎన్నిక‌లు జ‌రుగుతున్న తెలంగాణ‌, త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీపై కేంద్రం ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక మీడియాపై ప్ర‌త్యేకంగా నివేదిక‌లు తెప్పించుకుంటోంది. స్థానికంగా జిల్లాల్లో ఉన్న చానెళ్లు ఎన్ని? ఆయా చానెళ్ల నిర్వాహ‌కులు ఏపార్టీకి మొగ్గు చూపుతున్నారు? ఎప్ప‌టి నుంచి ఛానెళ్లు నిర్వ‌హిస్తున్నారు? నిర్వాహ‌కులు ఎవ‌రు? ఎన్ని చానెళ్లు ఉన్నాయి? వారి ఫోన్ నెంబ‌ర్లు ఏంటి? అనే అనేక విష‌యాల‌ను కేంద్రం రాబ‌డుతోంది.

దీనికి దూర‌ద‌ర్శ‌న్ ప్రాంతీయ విభాగాలైన యాద‌గిరి(తెలంగాణ‌), స‌ప్త‌గిరి(ఏపీ)ల ద్వారా సంపూర్ణ స‌మాచా రాన్ని యుద్ధ ప్రాతిప‌దికన సేక‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. స్థానికంగా రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల ఛానెళ్ల‌ను ప్ర‌త్యేకంగా పొందు ప‌ర‌చాల‌ని కూడా ఒక ప్ర‌త్యేక ఫార్మాట్‌ను రూపొందించ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయా డీడీ ఛానెళ్ల ప్రాంతీయ విభాగాధిప‌తుల‌ను ఆదేశించింది. దీంతో ఇప్పుడు వారు ఈ స‌మాచారాన్ని సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు.

స‌హ‌జంగానే ప్రాంతీయ చానెళ్లు రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. రాజ‌కీయ అండ‌లేకుండా.. చానె|ళ్లు న‌డిచే ప‌రిస్థితి లేదు. దీంతో ఎన్నిక‌ల్లో వారి ప్ర‌భావం క్షేత్ర‌స్థాయిలో ఉంటుంది. దీనిని ప‌సిగ‌ట్టిన కేంద్రంలోని బీజేపీ పెద్దలు ముందుగానే ఆయా చానెళ్ల స‌మాచారం తెప్పించుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఆయా ఛానెళ్ల‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మో.. లేక త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డ‌మో చేసే వ్యూహం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News