ఇటలీ నుంచి ఇండియా రాగానే భార్య హత్య... పరారీలో ఎన్నారై!

కుటుంబ కలహాలతోనే కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడని చెబుతున్నారు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లాలోఈ ఘాతుకం చోటు చేసుకుంది.

Update: 2023-11-01 12:21 GMT

విదేశాలనుంచి తిరిగొచ్చిన కొన్ని గంటల్లోనే భార్యను హతమార్చాడో భర్త. ఎందుకు హత్యచేశాడనే విషయంపై ఇంతవరకూ ఒక క్లారిటీ లేనప్పటికీ.. పోలీసులు మాత్రం ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్నారై భర్త పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు అతడు విదేశాలకు పారిపోకుండా నిఘా పెట్టారు. స్థానికంగా ఈ విషయం చర్చనీయాశం అయ్యింది.

అవును... ఇటలీ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ఒక ఎన్నారై భర్త... ఇంటికొచ్చిన కొద్ది గంటల్లోనే భార్యను హతమార్చాడు. కుటుంబ కలహాలతోనే కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడని చెబుతున్నారు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లాలోఈ ఘాతుకం చోటు చేసుకుంది. నిందితుడు సుఖ్‌ దేవ్ సింగ్‌ పరారీలో ఉన్నాడని.. అతడి కొసం గాలిస్తున్నామని.. ఇదే సమయంలో విమానాశ్రయాలకు కూడా సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో... కపుర్తలా జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నారై సుఖ్‌ దేవ్ సింగ్‌ సోమవారం పారిస్ నుంచి సంధు చాతా గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు. అదే రోజు అతని భార్య హర్‌ ప్రీత్ కౌర్ (45)తో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. ఈ సమయంలో సహనం కోల్పోయిన సుఖ్‌ దేవ్.. భార్యపై తీవ్రంగా దాడి చేశాడు!

ఇందులో భాగంగా ఆమెను కిందపడేసి తలను బలంగా నేలకేసి బాదాడు. దీంతో అతడి భార్య అక్కడికక్కడే చనిపోయిందని ఎస్పీ తెలిపారు. అయితే ఈ గొడవకు, అనంతరం జరిగిన హత్యకు గల కారణం తెలియరాలేదు. సమాచారం అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యక బృందాలను ఏర్పాటు చేసి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది!

మరోవైపు.. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News