హోం శాఖ మీద నిజంగానే పవన్ మనసు పడ్డారా ?

అయితే అది ఆయన కోరుకోలేదు అని కూడా ఆ తరువాత కధనాలు వచ్చాయి.

Update: 2024-11-06 04:11 GMT

తనకు పదవులు ముఖ్యం కాదని తరచూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు. తనకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని కూడా ఆయన అంటూ ఉంటారు. ఇక టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరినపుడు పవన్ కి కీలకమైన హోం శాఖనే ఇస్తారు అని అంతా అనుకున్నారు. అంతా భావించినట్లుగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఉన్నా హోం శాఖ మాత్రం ఆయనకు దక్కలేదు.

అయితే అది ఆయన కోరుకోలేదు అని కూడా ఆ తరువాత కధనాలు వచ్చాయి. ఆయన తనకు ఎంతో ఇష్టమైన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలనే కోరుకున్నారు అని కూడా అంతా ప్రచారం సాగింది. ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువు తీరి అయిదు నెలలు గడచిన తరువాత సడెన్ గా పవన్ తాను హోం మంత్రిని అయితే అన్న చర్చకు తెర తీశారు.

అది కూడా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. కావాలని అనుకుంటే నేను హోం మంత్రిని కాగలను నేనే హోం మంత్రిని అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. దీనిని బట్టి చూస్తే పవన్ మనసు ఇపుడు హోం శాఖ మీద పడిందా అన్నదే అంతటా చర్చగా ఉంది.

తనకు పదవులే వద్దు అనుకున్న పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కీలకమైన నాలుగు శాఖలను తీసుకున్నారు. అందులో లోతుపాతులను తెలుసుకుంటున్నారు. తన శాఖలో పట్టు సాధిస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఉన్నట్లుండి హోం శాఖ కావాలని కోరుకోవడమేంటని చర్చ సాగుతోంది.

అయితే పవన్ మనసులో ఈ భావన సడెన్ గా వచ్చిందా లేక ఆయన నిజంగానే దీని మీద పట్టుబడుతున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు అని అంటున్నారు. హోం శాఖ అంటే సీఎం పోస్టు తరువాత స్థానంలో ఉంటుంది. అయిదు టాప్ ఫైవ్ ర్యాంక్ మినిస్టర్ పోస్టులలో అది ఒకటిగా ఉంటుంది.

అయితే హోం శాఖను పవన్ కోరుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ బాగా లేదని రోజూ ఫిర్యాదులు వస్తున్నాయని ఇక చూస్తే హోం మంత్రిగా అనిత ఉన్నా తెర వెనక చక్రం తిప్పేవారు ఉన్నారని కూడా అనుమానాలు ప్రచారం ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే జనసేన నేతలకు కూడా సరైన మర్యాద ఈ శాఖ వద్ద దక్కడం లేదు అని అంటున్నారు. అంతా టీడీపీ వారు కోరుకున్న మేరకే పోలీసుల పోస్టింగులు జరిగాయని అంటున్నారు. ఇక జనసేన నేతలు

కూడా బాధితులుగానే గత ప్రభుత్వంలో ఉందని అయితే వారి బాధలు వారి విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు.

అందుకే పవన్ ఒక మాట అన్నారు. తన మీద కేసులు పెట్టడానికి నాడు ఉత్సాహం చూపించిన వారు ఇపుడు ఎందుకు తగ్గిపోతున్నారు అని. అంటే ఆయన పూర్తిగా పోలీస్ శాఖ మీద చాలా కాలంగా ఫోకస్ పెట్టి ఉంచారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే మంత్రి వర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు. దాంతోనే పవన్ హోం శాఖ మీద పట్టుబడుతున్నారా అన్న చర్చ వస్తోంది.

ఏపీలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టడానికే తాను ఈ శాఖను తీసుకుంటాను అని కూడా పవన్ చెబుతున్నారు. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయం మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివేదికను తెప్పించుకున్నారని ఆ మీదటనే పవన్ ఢిల్లీకి వెళ్తున్నారని అమిత్ షా సైతం పవన్ కి అపాయింట్మెంట్ ఇచ్చారని అంటున్నారు.

ఇక రానున్న రోజులలో మంత్రి వర్గ శాఖల మార్పులు అంటూ జరిగితే పవన్ కి హోం శాఖ ఇస్తారని కూడా అపుడే ప్రచారం మొదలైంది. ఏపీలో కీలకంగా ఉన్న బీజేపీ కేంద్ర పెద్దలు అయితే పవన్ ని అత్యంత కీలక స్థానంలో చూడాలని భావిస్తున్నారు అని అంటున్నారు. అందులో భాగంగానే పవన్ చేతికి హోం శాఖ పగ్గాలు అందుతాయని ప్రచారం అయితే మొదలైంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News