ఏపీ హైకోర్టులో కీలక పరిణామం.. ఆర్జీవీ 'దౌడ్' తప్పదా?
ఈ సమయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆర్జీవీ దర్శకత్వం వహించిన 'దౌడ్' సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 1997లో వచ్చిన ఈ సినిమా తరహాలో ప్రస్తుతం ఆర్జీవీ పరిస్థితి ఉందని అంటున్నారు. ఏకంగా తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతోనే "దొంగ - పోలీస్" ఆట ఆడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... ఏపీ పోలీసులు – రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఈ నెల 25 వరకూ ఒకెత్తు, ఆ రోజునుంచి మరొకెత్తు అన్నట్లుగా మారిపోయింది. ఈ సమయంలో ఈ నెల 25న ఆర్జీవీ విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు సిద్ధమయ్యారరనే చర్చ జరిగింది.
అప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ.. పోలీసులకు చిక్కలేదు! ఓ పక్క ఫోన్ స్విచ్చాఫ్, మరో పక్క ఆయన ఆచూకీ తెలియని పరిస్థితి. దీంతో... ఏపీ పోలీసులు అటు తమిళనాడు, ఇటు తెలంగాణ పోలీసుల సహాయ సహకారాలు తీసుకుని మరీ ఆర్జీవీ కోసం వెతుకులాట ప్రారంభించారని అంటున్నారు.
దీంతో... ఆర్జీవీకి జైలా - బెయిలా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణాను ఏపీ ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. దీంతో.. ఈ నెల 27న ఆర్జీవీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో రేపు ఈ పిటిషన్ పై విచారణ వ్యవహరంపై క్లారిటీ వచ్చే వరకూ ఆర్జీవీ దౌడ్ తప్పదా అనే చర్చ తెరపైకి వచ్చింది. మరోపక్క ఈ లోపు పోలీసులకు దొరికితే మాత్రం వెంటనే అరెస్ట్ తప్పదని అంటున్నారు. మరి... బుధవారం నాడైనా ఆర్జీవీకి జైలా - బెయిలా అనే విషయంపై క్లారిటీ వస్తుందా లేదా అనేది వేచి చూడాలి!
మరోపక్క ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న ఆర్జీవీ ఆచూకీ కోసం ఏపీ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని అంటున్నారు. ఇటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అటు కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ ల వద్దా గాలిస్తున్నారని అంటున్నారు! మరి.. ఆర్జీవీ ఎపిసోడ్ క్లైమాస్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది!