మహిళా ట్యాక్స్ పేయర్లు... తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ వాస్తవాలు!

అయితే... ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళా ట్యాక్స్ పేయర్స్ సంఖ్యపై షాకింగ్ వివరాలు తెరపైకి వచ్చాయి!

Update: 2024-11-26 08:30 GMT

గడిచిన దశాబ్ధకాలంలో దేశంలో వ్యక్తిగత ఆదాయప పన్ను చెల్ల్లించే వారి సంఖ్య భారీ గా పెరిగిందంటూ 2014 నుంచి 2024 వరకూ వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే... ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళా ట్యాక్స్ పేయర్స్ సంఖ్యపై షాకింగ్ వివరాలు తెరపైకి వచ్చాయి!

అవును... గడిచిన దశాబ్ధి కాలంలో దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య భారీగా పెరిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలో 2024 ఆర్థిక సంవత్సరంలో మహిళలు ఆదాయపు పన్ను చెల్లించిన వివరాలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... రాష్ట్రాల వారీగా ఈ జాబితా వెల్లడైంది! ఈ సమయంలో ఈ జాబితాలో మహారాష్ట్ర అగ్రగామిగా నిలిచింది!

2024 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్రలో సుమారు 36.8 లక్షల మంది మహిళలు ఆదాయపు పన్ను చెల్లించారని అంటున్నారు. దీంతో ఈ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో 22.5 లక్షలతో గుజరాత్ రెండోస్థానంలో ఉండగా.. 20.4 లక్షలతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.

ఇదే క్రమంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇందులో 15.5 లక్షలతో తమిళనాడు నాలుగో స్థానంలో ఉండగా.. 14.3 లక్షలతో కర్ణాటక ఐదో స్థానంలో నిలిచింది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ తమ బలమైన ఆర్థిక వాతావరణం, మహిళలకు అవకాశాలను చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... అటు పారిశ్రామికంగాను, ఇటు ఐటీ పవర్ హౌస్ గా ఉండాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను చెల్లించే మహిళల జాబితలో ఈ రెండు రాష్ట్రాలూ వెనుకబడి ఉన్నాయి. ఇందులో భాగంగా... 8.5 లక్షలతో తెలంగాణ 12వ స్థానంలో నిలవగా.. 6.5 లక్షలతో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో నిలిచింది.

ఈ సందర్భంగా రాష్ట్రాల వారీ జాబితా మొత్తం ఈ విధంగా ఉంది!:

1. మహారాష్ట్ర: 36.8 లక్షలు

2. గుజరాత్ : 22.5 లక్షలు

3. ఉత్తరప్రదేశ్: 20.4 లక్షలు

4. తమిళనాడు: 15.5 లక్షలు

5. కర్ణాటక: 14.3 లక్షలు

6. రాజస్థాన్: 13.5 లక్షలు

7. పంజాబ్: 13.2 లక్షలు

8. పశ్చిమ బెంగాల్: 12.9 లక్షలు

9. ఢిల్లీ: 12.0 లక్షలు

10. హర్యానా: 9.7 లక్షలు

11. మధ్యప్రదేశ్: 8.7 లక్షలు

12. తెలంగాణ: 8.5 లక్షలు

13. కేరళ: 7.7 లక్షలు

14. ఆంధ్రప్రదేశ్: 6.5 లక్షలు

15. బీహార్: 5.1 లక్షలు

Tags:    

Similar News