రాహుల్ ఆ హోదా అందుకుంటారా ?
బీజేపీకి 200 సీట్లు లోపు వస్తాయని పదే పదే చెప్పిన ఇండియా కూటమి నేతలు ఇపుడు 150 నంబర్ వద్ద ఫిక్స్ అయ్యారు అని అంటున్నారు.
ఈ నెల 4న అసలు ఫలితాలు రానున్నాయి. విజయం మాదే అని ఇండియా కూటమి భావిస్తోంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తే అలా ఏమీ లేవు. ఎన్డీయేదే మరోసారి అధికారం అని అంతా కలసి ఇచ్చేశాయి. ఏ ఒక్క సర్వేలోనూ 150 సీట్ల కంటే కూడా ఇండియా కూటమికి పెరగలేదు. బీజేపీకి 200 సీట్లు లోపు వస్తాయని పదే పదే చెప్పిన ఇండియా కూటమి నేతలు ఇపుడు 150 నంబర్ వద్ద ఫిక్స్ అయ్యారు అని అంటున్నారు.
అయితే అసలు ఫలితాలలో తమ తడాఖా చూపిస్తామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నా మరీ 150 నంబర్ కాస్తా 300 కి మారదని అంటున్నారు. పెరిగితే సీట్లు పెరగవచ్చు కానీ అధికారం మాత్రం దక్కదు అన్నది ఎగ్జిట్ పోల్స్ తేల్చేసిన విషయం.
ఇదిలా ఉంటే ఈసారి కూడా ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ పాత్ర ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది. ఆ దిశగా కూటమి నేతలు కాస్తా అయినా ఆలోచించుకోవడానికి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పనికి వస్తాయని అంటున్నారు.
ఇప్పటిదాకా రాహుల్ గాంధీ ఏ బాధ్యతా తీసుకోకుండా ఒక సాధారణ ఎంపీగానే వ్యవహరించారు. యూపీయే రెండు సార్లు అధికారంలో ఉన్నా ఆయన ఎంపీగానే ఉన్నారు తప్ప కేంద్ర మంత్రి కూడా కాలేదు. ఇక 2014, 2019లలో రెండు సార్లూ ఆయన ప్రతిపక్ష పాత్రలో ఒక ఎంపీగానే ఉన్నారు.
అయితే ఈసారి అలా కాదు అనే అంటున్నారు. రాహుల్ గాంధీ పొజిషన్ అంటే అధికారం తీసుకోకపోయినా అపొజిషన్ హోదా అయినా తీసుకుంటేనే 2029 నాటికి ఆయనకు మంచి చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఈసారి కాంగ్రెస్ సీట్లు పెరగడం ఖాయం. అలా కాంగ్రెస్ కి విపక్ష హోదా కచ్చితంగా దక్కుతుంది.
అందువల్ల కాంగ్రెస్ పక్షాన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ వ్యవహరించడమే మేలు అన్న వారూ ఉన్నారు. మోడీ అధికారంలో ప్రధానిగా ఉంటే ఆయనను ధీటుగా ఎదుర్కొనే విపక్ష నేతగా ఆయన ఉండాల్సిందే అంటున్నారు.
ఇక ఈసారి ఓటమితో కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది అన్న లెక్కలు ఉన్నా అలా కాకుండా కాంగ్రెస్ రాటు తేలుతుంది అన్న వారూ ఉన్నారు. రాహుల్ గాంధీ వయసు మోడీతో పోల్చితే బాగా తక్కువ. 2029 నాటికి ఆయన మరింత సమర్ధంగా ముందుకు వస్తారని అంటున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ కూడా కీలకమైన మార్పులు చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. ఎన్నికల్లో రాహుల్ చేసిన పోరాటం అద్భుతమని అంతా అంటున్నారు. భారత జోడో యాత్ర, న్యాయ యాత్ర కాంగ్రెస్ కి కలసి వస్తాయని లెక్కలు వేస్తున్నారు. అధికారంలోకి రాకపోయినా బలమైన ప్రతిపక్షంగా ఉన్నా కాంగ్రెస్ కి మరో ఎన్నికల నాటికి తిరుగు ఉండదని కూడా అంటున్నారు.