ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న నగరాలు... భారత్ నుంచి రెండు!

ఇదే సమాంలో... భారత్, చైనాలోని నగరాలతో ఈ జాబితాలో ఆసియా ఆధిపత్యం చెలాయిస్తుంది.

Update: 2024-11-10 04:19 GMT

ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితా తెరపైకి వచ్చింది. ఈ జాబితాలో టాప్ 10 నగరాల్లో భారతదేశం నుంచి రెండింటికి చోటు దక్కింది. ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో జపాన్ దేశంలోని విస్తారమైన మహా పట్టణం టోక్యో నిలీచింది. ఇదే సమాంలో... భారత్, చైనాలోని నగరాలతో ఈ జాబితాలో ఆసియా ఆధిపత్యం చెలాయిస్తుంది.

అవును... 2024లో ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన నగరాజ జాబితా తెరపైకి వచ్చింది. ఈ జాబితాలో భారత్ నుంచి ఢిల్లీ, ముంబై నగరాలూ స్థానం సంపాదించుకోగా.. కైరో, బీజింగ్ వంటి మహా నగరల స్థిరమైన విస్తరణను హైలైట్ చేస్తుంది.

అత్యధిక జనాభా ఉన్న టాప్ - 10 నగరాలు ఇప్పుడు చూద్దాం...!

టోక్యో - జపాన్:

సుమారు 37.1 మిలియన్ల జనాభాతో.. విస్తారణమైన మహానగరం టోక్యో ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అధినాతన మౌలిక సదుపాయాలు, శక్తివంతమైన సంస్కృతి, ఆర్థిక శక్తి కేంద్రంగా ఈ నగరం ప్రసిద్ధి చెందింది. ఫలితంగా... ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది.

ఢిల్లీ - భారత్:

ఈ జాబితాలో భారతదేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఈ నగరంలో 33.8 మిలియన్లకు పైగా ప్రజలు ఉన్నారు. ఇక్కడ వృద్ధి రేటు 2.63%గా ఉంది. ఇది దేశంలోని రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్రం గా ఉండటంతో వలసలతో వేగవంతమైన విస్తరణను ఎదుర్కొంటుంది.

షాంఘై - చైనా:

సుమారు 29.9 మిలియన్ల జనాభాతో ప్రపంచ ఆర్థిక కేంద్రంగా పేరు సంపాదించిన చైనా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ నగరం... వేగవంతమైన పట్టణీకరణ చైనా ఆర్థిక వృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఇది చైనా ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండటం కూడా ఒక కారణం!

ఢాకా - బంగ్లాదేశ్:

3.13% వృద్ధి రేటును ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఢాకా ఉంది. సుమారు 23.9 మిలియన్ల జనాభాతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే వేగవంతమైన విస్తరణ కారణం... ప్రస్తుతం మౌలిక సదుపాయాల విషయంలో సవాళ్లను ఎదుర్కోంటుంది.

సావో పాలో - బ్రైజిల్:

బ్రైల్ లోని అతిపెద్ద నగరం సావో పాలో లో 22.8 మిలియన్ల నివాసితులు ఉన్నారు. ఇది లాటిన్ అమెరికాలో ఇండస్ట్రీస్, ఫైనాన్షియల్ రంగాలకు కీలక కేంద్రంగా ఉంది. ఇక్కడ అద్భుతమైన సంక్స్ర్తితో పాటు విభిన్న ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి.

కైరో - ఈజిప్ట్:

గొప్ప చారిత్రక, సాంస్కృతిక కేంద్రంగా ఉన్న ఈజిప్ట్ లోని కైరో 22.6 మిలియన్ల జనాభాను కలిగి ఉంది. అయితే ఇక్కడ పెరుగుతున్న జనాభా... మౌలిక సదుపాయాలు,గృతాలు, సేవలపై ఒత్తిడిని జోడిస్తూంది.

మైస్కికో సిటీ - మెక్సికో:

లాటిన్ అమెరికాలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా ఉంది మెక్సికో నగరం. సుమారు 22.5 మిలియన్లకు పైగా ప్రజలతో వారసర్వం, శక్తివంతమైన కళల దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది.

బీజింగ్ - చైనా:

చైనా రాజధానిగా రాజకీయాలు, సాంస్కృతికీ, సాంకేతికంగా అభివృద్ధికి కేంద్రంగా బీజింగ్ దాని హోదాను కలిగి ఉంది. ఈ నగరంలో 22.1 మిలియన్ల జనాభా ఉండగా.. గణనీయమైన పెరుగుదల సూచిస్తుందని అంటున్నారు.

ముంబై - భారత్:

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం సుమారు 21.7 మిలియన్ల మంది జనాభా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ (బాలీవుడ్) కు పేరుగాంచిన ఈ నగరం... దాని జనసాంద్రత కోసం గృహాలు, మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.

ఒసాకా - జపాన్:

జపాన్ దేశానికి సంబంధించిన రెండో అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం ఒసాకా. ఈ నగరంలో జనాభా 18.9 మిలియన్లు కాగా.. వాణిజ్యం, వినోదం, చైత్రకు ప్రసిద్ధి చెందింది ఈ నగరం. అయితే ఇటీవల కాలంలో జనాభాలో స్వల్ప క్షీణతను సూచిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News