వైసీపీ 175/25 లిస్ట్ రెడీ ...నో చేంజెస్...!
మొత్తం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు 25 మంది ఎంపీ అభ్యర్ధులు ఖరారు అయిపోయారని ఒక సంచలన ప్రకటన చేసారు.
వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న దాని మీద ఇప్పటిదాకా అయితే క్లారిటీ ఉన్నా వీరే అభ్యర్ధులు అని అధికారిక ప్రకటన అయితే రావడం లేదు. ఈ నేపధ్యంలో జగన్ సొంత బాబాయ్ విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మార్చి మొదటి వారంలో జగన్ లిస్ట్ ఫైనల్ చెస్తారు అని అపుడే ఎమ్మెల్యే అభ్యర్ధులు ఎవరో తెలుస్తుంది అని అన్నారు.
ప్రస్తుతం ఉన్న వారు ఇంచార్జిలే తప్ప అభ్యర్ధులు కారని బాంబు వేశారు. దీంతో వైసీపీలో అంతా ఆందోళన పడ్డారు. అయితే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల మండల స్థాయి నాయకులతో జగన్ నిర్వహించిన మేము సిద్ధం మా బూత్ సిద్ధం అన్న వర్క్ షాప్ లో మాట్లాడుతూ మొత్తం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు 25 మంది ఎంపీ అభ్యర్ధులు ఖరారు అయిపోయారని ఒక సంచలన ప్రకటన చేసారు.
ఉంటే గింటే చిన్న మార్పులు తప్ప అంతా ఫైనల్ అయిపోయింది అని జగన్ చెప్పేశారు. ప్రస్తుతం ఉన్న ఇంచార్జిలే అభ్యర్ధులు అవుతారు అని జగన్ చెప్పకనే చెప్పేశారు. దాంతో మార్పు చేర్పుల పేరుతో ఎనభై మందిని మార్చిన లెక్క సరిపోయింది అని అంటున్నారు. ఆ మీదట పెద్దగా మార్పులు ఉండవని అంటున్నారు.
ఏమైనా ఉంటే చివరి నిముషంలో ఒకటి రెండు ఉంటే ఉండవచ్చు లేకపోతే అది కూడా ఉండదు అని అంటున్నారు. సామాజిక వర్గ ప్రాతిపదికన తీసుకుని జగన్ లిస్ట్ ఫైనలైజ్ చేశారు అని అంటున్నారు. అందువల్ల ఇపుడు ఉన్న ఇంచార్జిలను తొలగిస్తే మళ్లీ గందరగోళం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
దాంతో పాటు ఇంచార్జిలు అంతా జనంలోకి వెళ్తున్నారు. వారికి మద్దతు పెరిగేలా పార్టీ వ్యవహారం ఉండాలని అంటున్నారు అతి తక్కువ సమయంలో మార్పులు చేస్తే వైసీపీ ఇబ్బందులో పడుతుందని కూడా అంటున్నారు. ఇక జగన్ నోటి వెంట వచ్చిన ఈ మాటలతో వైసీపీ శ్రేణులు పూర్తిగా రిలీఫ్ ఫీల్ అవుతున్నాయి.
చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ మార్చలేదు ఆ నంబర్ దాదాపుగా 90కి పైగానే ఉంది. దాంతో వారంతా మరోసారి పోటీకి రెడీ అవవచ్చు అన్న సంకేతాలను జగన్ ఇచ్చేశారు అని అంటున్నారు. అలాగే ఎంపీ సీట్ల విషయంలో ఇప్పటికి మార్పు చేర్పుల వల్ల పది నుంచి పదిహేను మంది విషయం బయటకు వచ్చింది. మిగిలిన చోట్ల కూడా ఇంచార్జిల నియామకం పూర్తి అయిందని దాన్ని అధికారికంగా ప్రకటించడమే మిగిలింది అని అంటున్నారు.
ఫైనల్ టచప్ అన్నట్లుగా సిద్ధం నాలుగవ సభను పూర్తి చేసి జగన్ లిస్ట్ ని మొత్తం 175 సీట్లకు పాతిక ఎంపీ సీట్లకు రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. సో మార్చి మొదటి వారంలో ఫుల్ క్లారిటీతో ఎన్నికల గోదాలోకి వైసీపీ దిగిపోతోంది అని అంటున్నారు.