3 వైసీపీ ఎంపీల నామినేషన్లకు ఓకే.. ప్రకటనే మిగిలింది
అధికార పార్టీ వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి.. మేడా రఘునాథరెడ్డి.. గొల్ల బాబూరావులు నామినేషన్లు దాఖలు చేవారు.
ప్రస్తుతం ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల ఎంపిక నేపథ్యంలో ఏపీలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు నాలుగు నామినేషన్లు దాఖలు కావటం తెలిసిందే. మూడు నామినేషన్లను అధికార పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. నాలుగో నామినేషన్ ను మాత్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
అధికార పార్టీ వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి.. మేడా రఘునాథరెడ్డి.. గొల్ల బాబూరావులు నామినేషన్లు దాఖలు చేవారు. తాజాగా జరిపిన నామినేషన్ల పరిశీలనా కార్యక్రమంలో ముగ్గురు వైసీపీ ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు ఓకే అయ్యాయి. నపాలుగో అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ నిబంధనల ప్రకారం లేదని గుర్తించారు.
తాజాగా ఆయన నామినేషన్ ను రిజెక్టు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం.. రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసే సమయంలో.. సదరు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలి. కానీ.. ప్రభాకర్ నాయుడు నామినేషన్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా సంతకం చేయకపోవటం గమనార్హం. దీంతో.. ఆయన నామినేషన్ చెల్లదంటూ ఎన్నికల అధికారులు ప్రకటించారు.
దీంతో.. మూడు నామినేషన్లు మాత్రమే మిగిలాయి. ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటంతో.. వారి ఎన్నిక ఏకగ్రీవంగా మారినట్లైంది. ఈ నెల 20 వరకు ఉపసంహరణ గడువు ఉండటంతో.. మూడు స్థానాల నుంచి ఉపసంహరించుకునే అవకాశం లేదు. అయినప్పటికీ.. ప్రొసీజర్ లో భాగంగా తుది గడువు వరకు వెయిట్ చేసి.. అనంతరం ఈ ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లుగా అధికారికంగా ప్రకటిస్తారు.