యూత్..మహిళలే టార్గెట్టా ?

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో అన్నీ పార్టీల చూపు యూత్, మహిళలపైనే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఓటర్లలో పురుషుల ఓట్లకన్నా మహిళలు ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

Update: 2023-10-09 17:30 GMT

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో అన్నీ పార్టీల చూపు యూత్, మహిళలపైనే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఓటర్లలో పురుషుల ఓట్లకన్నా మహిళలు ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే అర్బన్ ప్రాంతాలంతా యూత్ ఓట్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఎలాగంటే యూత్ ఓటర్లే తమ ఊర్లతో పాటు కుటుంబాల్లో నిర్ణయాత్మక శక్తిగా అన్నీ పార్టీలు అంచనాలు వేస్తున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో 3.17 కోట్లమంది ఓటర్లున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ ఈమధ్యనే ప్రకటించింది.

నిజానికి ఓవరాల్ గా చూస్తే పురుషులు, మహిళల ఓట్లలో పెద్ద తేడా లేదు. అయితే 119 నియోజకవర్గాల్లో సుమారు 75 చోట్ల మహిళల ఓట్లే ఎక్కువని తేలింది. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గమని తేడాలేకుండా అర్బన్ ప్రాంతాల్లో యూత్ ఓట్లు మరింత కీలకమని పార్టీలు భావిస్తున్నాయి. యూత్ అంటే 18 నుండి 30 వయసుల మధ్య ఉన్నవాళ్ళే. వీళ్ళల్లో మొదటిసారి ఓట్లు వేయబోతున్న వారి సంఖ్య సుమారు 8 లక్షలు. మొత్తం యూత్ ఓట్లు తీసుకుంటే సుమారు 50 లక్షలుగా ఉందని లెక్కలు చెబుతున్నాయి.

మహిళలు, యూత్ ఓట్లు ఇంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టే అన్నీ పార్టీల గురి ఈ సెక్షన్లపైనే పడింది. అందుకనే వీళ్ళని ఆకట్టుకునేందుకు హామీల్లో ఎక్కువభాగం వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. సిక్స్ గ్యాంరెటీస్ పేరుతో కాంగ్రెస్ మహిళలను, యూత్ ను ఆకట్టుకునేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించామనే ప్రచారంతో మహిళల ఓట్లకు బీజేపీ గాలమేస్తోంది.

ఇదే సమయంలో కల్యాణ్ లక్ష్మి, గృహలక్ష్మి, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం అంతా తమ పుణ్యమే అని బీఆర్ఎస్ కూడా క్లైం చేస్తోంది. తాను పెట్టిన ఒత్తిడి కారణంగానే అన్నీ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మహిళా బిల్లు ఆమోదం పొందేట్లుగా చర్యలు తీసుకున్నాయని కవిత క్లైం చేస్తున్నారు. మొత్తంమీద అన్నీ పార్టీలు ఇప్పటికి ప్రకటించినవి కాకుండా ఇంకెన్ని హామీలను మహిళలు, యూత్ ను ఆకర్షించేందుకు ప్రకటిస్తాయో చూడాల్సిందే.

Tags:    

Similar News