జగన్ అవినీతి గురించి మాట్లాడను... సీరియస్ గానే పవన్...!
జగన్ అవినీతి గురించి మాట్లాడను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు
జగన్ అవినీతి గురించి మాట్లాడను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. అది కూడా సీరియస్ గానే. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు దేనికి అంటేనే రీజన్స్ ఉన్నాయి అని అంటున్నారు.
నిజంగా ప్రజలు అవినీతిపై తీవ్రంగా ఆలోచిస్తే 2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు అని పవన్ చాలా విశ్లేషణాత్మకంగా వివరణ ఇచ్చారు. అందుకే కాస్తా ఆలస్యం అయిన తరువాత ఇవన్నీ చూసే నేను అవినీతి గురించి మాట్లాడటం మానేశాను అని అన్నారు.
ఎందుకంటే అవినీతి విషయంలో ప్రజలకు అయితే పెద్దగా ఆందోళన ఉండడం లేదు అని పవన్ అంటున్నారు. ఇక ప్రజల సమస్యల మీదనే వారికి ఆలోచన ఉంటుంది కాబట్టి నా పోరాటం ఆ దిశగానే అని ఆయన అంటున్నారు. ప్రజల జీవితాలను దుర్భరం చేసిన వైసీపీ ప్రభుత్వ విధానాలపై నేను దృష్టి సారిస్తున్నాను అని పవన్ స్పష్టంగా చెప్పేశారు.
అయితే అవినీతి సమాజానికి పెను ప్రమాదంగా మారుతున్నప్పటికీ అవినీతిపై ప్రజల ఆలోచనా విధానం మారిందని పవన్ అంటున్నారు. అయితే ఎల్లకాలం ఇలాగే ఉండదని అంతిమంగా మంచి మాత్రమే గెలుస్తుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం విశేషం. ఇక జగన్ అవినీతి పనుల గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియకపోవచ్చని పవన్ అనడమూ ఇక్కడ గమనార్హం.
ఇక జగన్ తండ్రి వైఎస్సార్ కి 2004 ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా డబ్బులు లేవని పవన్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అయిన తరువాతనే పరిస్థితి మారిందని ఆయన అంటున్నారు. ఏది ఏమైనా జగన్ అవినీతి గురించి మాట్లాడను అని ఆయన అనడం సంచలన ప్రకటనగానే చూడాల్సి ఉంది.
అయితే జనసేన అధినేత మాట మీద నిలబడరు అని ప్రత్యర్ధులు అంటూంటారు. ఇక రాజకీయ విశ్లేషకులు కూడా దాన్నే పెద్ద లోపంగా చెబుతారు. కానీ అంతా అంగీకరించే విషయం ఒకటి ఉంది. అదే పవన్ ఒకే మాట మీద ఉన్నది ఒక్క జగన్ విషయంలో మాత్రమే అని. జగన్ అంటే పవన్ కి పడదు అని అంటారు. ఎందుకు అంటే రీజన్స్ ఎవరికీ తెలియవు.
నిజానికి ఒక తమాషా ఏంటి అంటే ఈ ఇద్దరూ ఎపుడూ కలుసుకున్న సందర్భమే లేదు. చంద్రబాబు జగన్ చాలా సార్లు కలుసుకున్నారు. కానీ పవన్ జగన్ ముఖాలు కూడా చూసుకున్నది లేదు. పవన్ అన్న చిరజీవి జగన్ కూడా అనేక సార్లు కలుసుకున్నారు. కానీ పవన్ మాత్రం ఎపుడూ జగన్ తో కలవలేదు. అలాంటి సందర్భాలు వచ్చినా అవాయిడ్ చేశారని అంటారు.
రాజ్ భవన్ లో ఏటా రెండు సార్లు ఎట్ హోం అంటూ ఇచ్చే ప్రోటోకాల్ కార్యక్రమానికి కూడా పవన్ హాజరైంది లేదు. ఇక పవన్ ఎమ్మెల్యేగా గెలవకపోవడం వల్ల అసెంబ్లీలో కూడా జగన్ తో కలిసింది లేదు. అయినా సరే ఈ ఇద్దరు నేతల మధ్య వైరం అలా కొనసాగుతోంది. అది కేవలం రాజకీయాలకు సంబంధించినదా అంటే దానికి మించి అని అంటారు.
జగన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే పవన్ చెప్పే సమాధానం ఒక్కటే. ఆయన అవినీతిపరుడు అని. అయితే రాజకీయాల్లో చాలా మంది అవినీతిపరులు ఉన్నారు కదా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. దానికి జవాబు మాత్రం జనసేనాని వద్ద లేదు అని అంటారు. ఎక్కడ ఏమి జరిగినా ఆఖరుకు తెలంగాణా ఎన్నికల ప్రచారం అయినా తిప్పి తిప్పి జగన్ మీద విమర్శలకు ఉపయోగించడం పవన్ కే చెల్లింది అని కూడా వైసీపీ నేతలు విమర్శిస్తారు.
అయితే పవన్ మాత్రం జగన్ అవినీతి గురించి మాట్లాడను వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని, విపక్షంగా తాను విమర్శించాల్సిందే అని ఆయన అంటున్నారు. మొత్తానికి జనసేన నేత ఈ విధంగా జగన్ విషయంలో ఈ రకంగా ఆలోచించడం వెనక అనేక రీజన్స్ ఉన్నాయని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలని అంటున్నారు.