జగన్ విదేశాలకు...బాధ్యతలు ఎవరికంటే...?
ఏపీలో రాజకీయం వేడెక్కిపోతోంది. అటు చంద్రబాబు ఇటు పవన్ మరో వైపు లోకేష్ ఇలా నలు చెరగులా కలియ తిరిగేస్తున్నారు
ఏపీలో రాజకీయం వేడెక్కిపోతోంది. అటు చంద్రబాబు ఇటు పవన్ మరో వైపు లోకేష్ ఇలా నలు చెరగులా కలియ తిరిగేస్తున్నారు. జగన్ మీద రోజుకు పదుల సంఖ్యలో విమర్శలు చేస్తున్నారు. టీడీపీ క్యాడర్ సైతం యాక్టివ్ అయింది. జిల్లాలలో సైతం ఆందోళనలు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
ఇంకో వైపు సీపీఐ బస్సు యాత్ర చేస్తూ జగన్ ప్రభుత్వాన్ని తూర్పరా పడుతోంది. బీజేపీకి కొత్త అధ్యక్షురాలిగా వచ్చిన దగ్గుబాటి పురంధేశ్వరి సైతం వైసీపీ మీద ఒక్క లెక్కన విరుచుకుపడుతున్నారు. ఈ పరిణామాలతో వైసీపీకి రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఉంది.
అన్ని నోట్లకు ఒక్క వైపు నుంచే వైసీపీ జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక జగన్ సైతం దూకుడు చేస్తున్నారు. స్పీడ్ పెంచారు. జిల్లా టూర్లు పెట్టుకుంటున్నారు. ఇలా ఏపీ రాజకీయం మంచి కాక మీద ఉన్న నేపధ్యంలో సడెన్ గా జగన్ విదేశీ టూర్ పెట్టుకున్నారు. ఏకంగా ఆయన సెప్టెంబర్ 2 నుంచి 12 దాకా పది రోజుల లండన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న జగన్ కి విదేశీ పర్యటనలు చేసేందుకు కోర్టు అనుమతి కావాలి. దాని మీద కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. దాంతో జగన్ విదేశీ టూర్ కన్ ఫర్మ్ అయింది. ఆయన సెప్టెంబర్ 2న తన తండ్రి వర్ధంతి వేళ ఇడుపులపాయకు వచ్చి ఘన నివాళి అర్పిస్తారు. అక్కడ నుంచే డైరెక్ట్ గా ఆయన లండన్ టూర్ కి బయల్దేరి వెళ్తారు.
విదేశాలలో చదువుకుంటున్న తన ఇద్దరు కుమార్తెలను చూసేందుకే జగన్ ఈ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు. మరో ఏడెమిది నెలలలో జరిగే ఏపీ ఎన్నికలు ఈసారి హోరా హోరీ కానున్నాయి. దాంతో ఇపుడే కొంత వెసులుబాటు ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి ఈ విదేశీ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు.
ఇక ఏపీఓ సీఎం లేకుండా పది రోజుల పాటు పాలన సాగనుంది. మరి సీఎం లేని వేళ ఎవరు బాధ్యత తీఎసుకుంటారు. ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు అంటే గతంలో సైతం జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. ఏపీ క్యాబినేట్ లో సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు
కానీ జగన్ ఎవరికీ ఏమీ అప్పగించబోవడలేదు అంటున్నారు. ఆయన విదేశాలలో ఉన్నా అవసరం అయినపుడు వర్చువల్ గా అంతా చక్కబెట్టేందుకు కూడా వీలు ఉంటుందని అంటున్నారు. దాంతో జగన్ ఏపీలో లేకపోయినా పాలన సజావుగానే సాగనుంది అని అంటున్నారు. మరో వైపు జగన్ మీద విమర్శలు చేస్తూ విపక్షాలు తమ ప్రచారాన్ని కానీ ఆందోళననలు కానీ పీక్స్ చేరుస్తున్నాయి. ఇపుడు జగన్ ఫిజికల్ గా తాడేపల్లిలో లేని సందర్భంలో ఆందోళనల దూకుడుని మరింత పెంచుతాయా లేక యాజ్ ఇటీజ్ గా వైసీపీ ప్రభుత్వం మీద తమ పోరాటాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతాయా అన్నది చూడాలి.
నిజానికి సీఎం ఫిజికల్ ఉన్నపుడు చేసే ఆరోపణలకు ఊపు హుషారు వస్తాయి. ఆయన విదేశాలలో ఉండగా ఇక్కడ ఎంత హడావుడి చేసినా అవి ఒకింత చప్పగానే సాగుతాయని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఏపీలో లేని ఆ పది రోజులూ రాజకీయం ఎలా సాగుతుందో చూడాల్సిందే.