లోకేష్ తో వైసీపీ ఎంపీ... కరచాలనంపై కొత్త కథనాలు!
ప్రస్తుతం వైసీపీ - టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని అంటుంటారు రాజకీయ పరిశీలకులు. పార్టీల మధ్య విభేదాలు వ్యక్తిగత కక్షలకంటే ఎక్కువైపోయాయని అంటుంటారు. ఈ క్రమంలో... లోకేష్ తో షేక్ హ్యాండ్ చేసే సమయంలో వైసీపీ ఎంపీ హడావిడి చేశారనే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుందని తెలుస్తుంది.
ప్రస్తుతం వైసీపీ - టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని అంటుంటారు రాజకీయ పరిశీలకులు. పార్టీల మధ్య విభేదాలు వ్యక్తిగత కక్షలకంటే ఎక్కువైపోయాయని అంటుంటారు. ఈ క్రమంలో... లోకేష్ తో షేక్ హ్యాండ్ చేసే సమయంలో వైసీపీ ఎంపీ హడావిడి చేశారనే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుందని తెలుస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే... చైతన్య విద్యాసంస్థల అధినేత బి.ఎస్. రావు హైదరాబాద్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, విద్యాసంస్థల అధినేతలు ఆయనకు నివాళులు అరిపించారు.
ఈ సమయంలో ఘటనా స్థలంలో వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ నేత నారా లోకేష్ కూడా ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో వైసీపీ ఎంపీ నివాళులు అర్పించి వెళ్లిపోతుండగా... ఎదురుగా వస్తోన్న నారా లోకేశ్ వద్దకు వచ్చినప్పుడు ఆసక్తికర సంఘటన జరిగిందని అంటున్నారు.
ఈ విషయంలో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఎలాంటి బేషజాలకూ తావివ్వకుండా వైసీపీ యువ ఎంపీ ఆగి.. జనాలను తోసుకుని.. నారా లోకేష్ తో కరచాలనం చేశారని అంటున్నారు. దీంతో స్థానికంగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారిందని తెలుస్తుంది.
పైగా... నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో ఎంపీకి సరిగా పడటం లేదని కథనాలొస్తున్నాయని అంటున్న సమయంలో... వీరి కరచాలనం అందరి దృష్టిని ఆకర్షించిందని అంటున్నారు. ఇందుకు కారణం... చిలకలూరిపేట సెగ్మెంట్ లోకి ఎంపీని రానీయకుండా మంత్రి రజినీ అనుచరులు అడ్డుకోవడంతో రాజకీయ విభేదాలు తెరపైకి వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.
కాగా... గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు తో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రహస్యంగా సమావేశాలు జరుపుతున్నారని, ఆయన టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్ డే ని ఆయన అభిమానుల సమక్షంలో ఎంపీ నిర్వహించారని వార్తలు వచ్చాయని తెలుస్తుంది.
అయితే అలాంటిదేమీ లేదని, టీడీపీతో ఎలాంటి చర్చలూ జరపగదని అటు ఎంపీతోఈ పాటు, ఇటు లోకేష్ కూడా వివరణ ఇచ్చారని అంటున్నారు. దీంతో ఆ వ్యవహారం సద్దుమణిగిందని తెలుస్తున్న సమయంలో.. ఈ కరచాలనం అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారిందని తెలుస్తుంది.
అయితే ఇది అత్యంత సాధారణమైన సంఘటన అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భూతద్దం పెట్టి వెతికేటంత విషయం ఏముందని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఎంపీ ఎలాంటి వివరణ ఇస్తారనేది వేచి చూడాలి అని అంటున్నారు పరిశీలకులు!