సెప్టెంబర్ డైరీ : లండన్ ఫ్లైట్ ఎక్కేస్తున్న జగన్

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ భారీ ఓటమి తరువాత ఏపీని వీడి దాదాపుగా నెల రోజుల పాటు సదూర ప్రాంతాలకు వెళ్తున్నారు ఆయన యూకే టూర్ కి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.

Update: 2024-08-28 03:41 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ భారీ ఓటమి తరువాత ఏపీని వీడి దాదాపుగా నెల రోజుల పాటు సదూర ప్రాంతాలకు వెళ్తున్నారు ఆయన యూకే టూర్ కి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. జగన్ సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 25 వరకూ యూకే పర్యటనకు కోర్టు అంగీకరించింది.

ఈ మేరకు ఆయనకు వెసులుబాటు కల్పించింది. తన కుమార్తె పుట్టిన రోజు ఉన్నందున లండన్ టూర్ కి వెళ్లాలని జగన్ పెట్టుకున్న పిటిషన్ కి సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసినా కోర్టు మాత్రం వైసీపీ అధినేతకు శుభవార్తనే వినిపించింది.

అయితే కొన్ని కండిషన్లు పెట్టింది జగన్ ఫోన్ నంబర్ మెయిల్ ఐడీ ఇవ్వాలని కోరింది. దాంతో జగన్ లండన్ టూర్ కి సర్వం సిద్ధం అయింది. జగన్ మరో సారి లాంగ్ టూర్ కి వెళ్లడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జగన్ ప్రస్తుతం బెంగళూరు టూ తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తున్నారు అని ప్రచారంలో ఉంది.

ఇక చూస్తే సెప్టెంబర్ 2న దివంగత నేత మాజీ సీఎం వైఎస్సార్ వర్ధంతి. ఆ రోజున ఇడుపులపాయలో జగన్ తన తండ్రికి నివాళి అర్పించిన అనంతరం సెప్టెంబర్ 3న లండన్ ఫ్లైట్ ఎక్కేస్తారు అని అంటున్నారు. దాంతో సెప్టెంబర్ నెల జగన్ డైరీ ఫుల్ అయినట్లే అంటున్నారు.

ఏపీలో చూస్తే వైసీపీ ఓటమి తరువాత సైలెంట్ అయింది. పార్టీ నేతలు కూడా పెద్దగా యాక్టివిటీస్ లేకుండా ఉన్నారు. జగన్ తాడేపల్లిలో రివ్యూస్ పెడుతున్నా కీలక నాయకులు అంతా దూరంగా ఉన్నారు. అయితే కనీసంగా ఆరు నెలల పాటు అధికార పక్షానికి టైం ఇచ్చి అపుడే గేర్ మార్చాలని జగన్ వ్యూహం అని అంటున్నారు.

అందుకే ఆయన ఎక్కువ టైం బెంగళూరు లో ఉంటున్నారు అని అంటున్నారు. ఇపుడు ఎటూ ఖాళీ దొరికింది కాబట్టి ఆయన యూకే టూర్ ని ప్లాన్ చేశారు అని అంటున్నారు. అక్కడ నుంచి వచ్చాకనే జగన్ పార్టీ విషయాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతారు అని అంటున్నారు.

అయితే జగన్ విదేశాల్లో ఉన్న వేళ పార్టీలో నంబర్ టూ ఎవరు పార్టీలో ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఎవరు నడిపిస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. దానికి బదులు అయితే లేదు. శాసనమండలిలో అపోజిషన్ లీడర్ గా ఉన్న బొత్స పార్టీలో కీలకం అవుతారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా జగన్ మాత్రం భారీ ఓటమి నుంచి ఉపశమనం కలిగించుకునేందుకే ఈ ట్రిప్ పెట్టుకున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News