మోడీని కలవనున్న వైసీపీ ఎంపీలు ?

ఇక పొలిటికల్ గాసిప్పులు ఒక రేంజిలో సాగుతాయి. ఇక ఎన్నికలు జరిగి నెలన్నర దాటింది. ఫలితాలు వచ్చి గట్టిగా నెల రోజులు కాలేదు

Update: 2024-06-27 14:46 GMT

ప్రధాని నరేంద్ర మోడీని వైసీపీ ఎంపీలు కలుస్తారు అన్నది తాజా వార్త. మామూలుగా చూస్తే ఇది అసలు వార్త కాదు ఎందుకంటే ఆయన దేశానికి ప్రధాని. ఏ ఎంపీ అయినా కలవవచ్చు అది స్వపక్షమా లేక విపక్షమా అన్న తేడా అసలు ఉండదు, అందరికీ ప్రధాని అన్నది రాజ్యాంగం చెబుతోంది. కానీ రాజకీయం బాగా ముదిరిన వర్తమాన కాలంలో ప్రతిపక్ష ఎంపీలు అధికార పక్ష అధినేతను కలుస్తారు అంటే చెప్పుకోవడానికి చాలా మ్యాటర్ ఉంటుంది అని అంటారు.

ఇక పొలిటికల్ గాసిప్పులు ఒక రేంజిలో సాగుతాయి. ఇక ఎన్నికలు జరిగి నెలన్నర దాటింది. ఫలితాలు వచ్చి గట్టిగా నెల రోజులు కాలేదు. రాజకీయం అంతా పచ్చిగానే ఉంది. దాంతో పాటు ఎన్డీయే ఏపీలో ఉంది. కేంద్రంలో ఉంది. ఇలా ప్రత్యర్థిగా వైసీపీ ఎదురు నిలిచి ఉంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు ప్రధానిని కలుస్తారు అంటే రాజకీయ మసాలా వార్తగానే చాలా మంది చూస్తారు అనడంలో సందేహం లేదు.

ఇదిలా ఉంటే వీలైనంత తొందరలోనే వైసీపీ ఎంపీలు అంతా ప్రధాని మోడీని కలుస్తారు అని వినికిడి. ఇందులో రాజ్యసభ ఎంపీలు 11 మంది లోక్ సభ ఎంపీలు 4 ఉంటారని అంటున్నారు. అంటే ఒక బిగ్ నంబర్ తోనే ప్రధాని మోడీని వైసీపీ ఎంపీలు కలవబోతున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీలో బిగ్ షాట్ అయిన పెద్దిరెడ్డి కుటుంబం ల్యాండ్ సాండ్ లిక్కర్ స్కాం లో కూరుకుని పోయింది అని అంటున్నారు. వీటి మీద ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. అవి గట్టిగా చుట్టుకుంటే సమస్యలే అని అంటున్నారు. దీంతో కొందరు ఎంపీలు బీజేపీలోకి వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. దీని మీద బెంగళూరు వేదికగా టాక్స్ ఒక స్థాయిలో సాగుతున్నాయని అంటున్నారు.

Read more!

గతంలో టీడీపీ ఇదే విధానం అనుసరించింది. ఆ పార్టీ బిగ్ షాట్స్ అంతా కూడా బీజేపీలో చేరి ఆనాటి వైసీపీ సర్కార్ ఫోకస్ నుంచి తప్పించుకున్నారు. ఇపుడు అదే ఫార్ములాను వైసీపీ అనుసరిస్తుందా అన్నదే చర్చగా ఉంది.బీజేపీకి కూడా ఇటు లోక్ సభతో పాటు అటు రాజ్యసభలో ఎంపీల అవసరం చాలానే ఉంది.

దాంతో ఉభయకుశలోపరిగా ఈ విధానం అనుసరిస్తారా అన్న చర్చ సాగుతోంది. వీటి మీద ఒక క్లారిటీ వచ్చేందుకే ప్రధాని మోడీతో వైసీపీ ఎంపీలు కలవబోతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే ఎవరెవరు బీజేపీ లోకి వెళ్తారు అన్నది కూడా ఆసక్తికరమైన చర్చగానే ఉంది. అందరూ వెళ్ళరని కొంతమంది కూటమి టార్గెటెడ్ బిగ్ షాట్స్ వెళ్తారని వాళ్ళు అక్కడ ఉంటే వైసీపీకి సేఫ్ జోన్ గా ఒక షెల్టర్ గా ఉంటుందని కూడా చర్చిస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ భోగట్టాలు అన్నీ వినికిడిగానే ఉన్నాయి. తొందరలోనే వీటి మీద ఫుల్ క్లారిటీ రానుంది అని అంటున్నారు.

Tags:    

Similar News