సింహం సింగిల్ అంటే కుదరదా ?

సింహం సింగిల్ గా వస్తుంది అంటూ వైసీపీ నేతలు తరచూ చెబుతూ ఉంటారు.

Update: 2024-07-04 03:33 GMT

సింహం సింగిల్ గా వస్తుంది అంటూ వైసీపీ నేతలు తరచూ చెబుతూ ఉంటారు. అయితే అది అన్ని వేళలా వర్కౌట్ కాదని 2024 ఎన్నికల్లో రుజువు అయిపోయింది. వైసీపీ పుట్టిన తరువాత ఎరగని ఘోరమైన పరాభవాన్ని ఎదుర్కొంది. ఇదిలా ఉంటే వైసీపీ ఉనికి ఇపుడు ప్రశ్నార్ధకంగా మారింది.

వైసీపీ బేస్ రూట్ చెదిరిపోయింది అని అంటున్నారు. ఆ పార్టీని అట్టిపెట్టుకొని ఉండే బలమైన రెడ్లు రెడ్ సిగ్నల్ చూపిస్తున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ వైపు మెల్లగా మొగ్గు చూపిస్తున్నారు. వైసీపీ మోడీ అనుకూలతతో ఉండడం కూడా వికటించేలా ఉంది.

ఈ మొత్తం పరిణామాలను చూస్తే వైసీపీ మూల ధనం లాంటి ఓటు బ్యాంక్ దెబ్బ తినిపోయింది అని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన 40 శాతం ఓటింగ్ అనేది శాశ్వతం కాదని అంటున్నారు. అధికారంలో ఉంటూ ఎన్నికల్లో పోరాడింది కాబట్టి ఆ బిగ్ ఫిగర్ వచ్చిందని అంటున్నారు.

దానికి తెలంగాణాలోని బీఅర్ఎస్ ని ఉదాహరణగా చూపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటూ ఎన్నికలకు వెళ్తే 37 శాతం ఓటు షేర్ దక్కింది. అదే ప్రతిపక్షంలో ఉంటూ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం 17 శాతమే ఓట్ షేర్ దక్కింది. అంటే ఓడిన పార్టీలో నేతలు ఉండదు, అభిమానులు కనిపించరు, ఇక జనాల ఆలోచనలు మారుతాయి. అధికారంలో ఉన్న పార్టీలు వీటిని అడ్వాంటేజ్ గా తీసుకుంటాయని అంటున్నారు.

Read more!

ఈ నేపధ్యంలో జగన్ పార్టీ ఇక మీదట తన వ్యూహాలను మార్చాలని అంటున్నారు. సింగిల్ అని చెప్పుకుంటూ ముందుకు పోతే మరిన్ని ఎన్నికల్లో కూడా బొక్క బోర్లా పడడం ఖాయమని అంటున్నారు. ఏపీలో ఎన్డీయే కూటమికి 56 శాతం ఓటు షేర్ ఉంది. వైసీపీకి 40 శాతం ఓటు షేర్ ఉంది అంటే మిగిలిన నాలుగు శాతం కాంగ్రెస్ ఇతర పార్టీలకు ఉంది.

దాంతో అధికార కూటమిని ఢీ కొట్టాలన్నా తనకు లభించిన ఓటు షేర్ ని మునిగిపోకుండా కాపాడుకోవాలన్నా జగన్ పొత్తులకు వెళ్లడమే మంచింది అని అంటున్నారు. జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉంది. దాంతో యాంటీ మోడీ ప్రభావం అంతకంతకూ పెరిగి అది 2029 నాటికి దేశమంతా పరచుకుంటుందని ఒక విశ్లేషణ ఉంది.

ఆ పార్టీతో అధికారంలో ఉన్న వారు పొత్తులు కుదుర్చుకున్న వారు అయిదేళ్ళ పాటు అధికారం అనుభవించిన తరువాత మునిగినా తప్పు లేదు. కానీ విపక్షంలో ఉంటూ మోడీకి వ్యతిరేకంగా సరైన స్టాండ్ తీసుకోకుండా ఉంటే వైసీపీ కూడా మునగడం ఖాయమని అంటున్నారు.

జాతీయ స్థాయిలో చూసినా ఏపీలో చూసినా వైసీపీ ఒక రాజకీయ విధానం లేకుండా పోతోంది అని అంటున్నారు. కేంద్రంలో ఏపీలో ఎన్డీయే ఉన్నపుడు దానికి ఎదురు నిలిచి పోరాడాలంటే ఎన్డీయే వ్యతిరేక శక్తులను కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

వామపక్షాలను ముందుగా దగ్గరకు తీసుకుంటే ఆ తరువాత పరిణామాల క్రమంలో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ తోనూ మైత్రీ హస్తం అందించడం ద్వారా ఏపీలో వైసీపీ కుదురుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని అంటున్నారు. అదే సమయంలో అయిదేళ్ల పాటు ప్రజా పక్షాన నిలిచి పోరాడాలన్న కావాల్సినంత రాజకీయ నైతిక మద్దతు కూడా ఆయా పార్టీల నుంచి దక్కుతుంది అని అంటున్నారు.

సింగిల్ గా పార్టీ ఇన్నాళ్ళూ పోరాడింది. రాజకీయాలు ఎపుడూ ఒకే విధంగా ఉండవు.ఏపీలో రాజకీయం ట్రయాంగిల్ దిశగా సాగేలా ఉంది. అడ్వాంటేజ్ ని జనసేన తీసుకోకుండా ఉండాలన్నా అలాగే కాంగ్రెస్ మొత్తం కబలించకుండా ఉండాలన్న వైసీపీ రాజకీయ తెలివిడితో వ్యూహరచన చేయాల్సి ఉందని అంటున్నారు.

కేవలం జగన్ ఒక్కరే సరిపోరు, ఆయన ఇమేజ్ కూడా సరిపోదు అని తాజా ఎన్నికలు రుజువు చేసినందువల్ల ఇక మీదట పటిష్టమైన వ్యూహాలతో రాజకీయ మిత్రులతో కలసి వస్తేనే మరింత కాలం వైసీపీకి రాజకీయ మనుగడ ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా చేసినా వైసీపీ రాజకీయ బలం క్షీణించడం మొదలవుతుందని ఆ మీదట ఎవరూ కాపాడలేని స్థితిలోకి వెళ్ళినా వెళ్లవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News

eac