షర్మిల గురించి... ఈ టాక్ విన్నారా?!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల గురించి.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇంట్ర స్టింగ్ టాక్ నడుస్తోంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల గురించి.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇంట్ర స్టింగ్ టాక్ నడుస్తోంది. తాను తెలంగాణ కోడలినని, తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తీసుకువస్తానని.. ఇక్కడ నిధులు, నియామకాలు, నీళ్లు వంటివి ఒకరి సొంతంగా అయిపోయాయని.. వాటిని ప్రజలకు అప్పగి స్తామని గతంలో షర్మిల చెప్పుకొచ్చారు. ఏపీ నుంచి తెలంగాణకు చేరి.. అక్కడ కొత్తగా పార్టీ పెట్టుకుని.. పాదయాత్ర కూడా చేశారు.
ఇక, అధికార పార్టీపైనా.. మంత్రులు, నేతలపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. `బోనమెత్తుట వచ్చునా అక్కా!`` అని ఎవరైనా ప్రశ్నిస్తే.. థాట్! నేను తెలంగాణ కోడలిని! అంటూ.. ఎదురు దాడి చేశారు. ఇక, రాజకీయ విశ్లేషకులు ఎవరైనా.. నీ పార్టీ బీ పార్టీ అని వ్యాఖ్యానిస్తే.. కారాలు మిరియాలు నూరారు. కానీ, ఇప్పుడు ఆవిడే షర్మిల.. అన్నట్టుగా ఢిల్లీ వీధుల్లో భర్తను వెంటేసుకుని మరీ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో బేరాలకు దిగిన తర్వాత సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఇప్పుడేం తెస్తవ్.. షర్మిలక్కా? అని నెటిజన్లు బుగ్గలు నొక్కుకుకుంటున్నారు. నీ పదవుల కోసం.. నీ టికెట్ల కోసమే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నవ్ కదా.. రేపు ప్రజల కోసం ఏం చేస్తవ్? గప్పుడు కూడా.. ఢిల్లీకి మొక్కుత వా? ఏంది? అని నిలదీస్తున్నారు. సొంతగా సీఎం అవుతానన్న షర్మిల.. ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరి.. తన అస్తిత్వాన్ని కోల్పోయారని కొందరు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్నికలు ముగిసే వరకు తన విధానాలను తాను అనుసరించి ఉంటే.. బాగుండేదని.. ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తర్వాత.. ఆమె స్టెప్ వేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. నిన్నటి వరకు అంతో ఇంతో సింపతీ గెయిన్ చేసుకున్న షర్మిల.. ఇప్పుడు ఢిల్లీ టూర్‌లతో కొత్త ఖల్లాస్ చేసుకున్నారనే వాదన బాహాటంగానే వినిపిస్తుం డడం గమనార్హం.