విజ‌య‌మ్మ 'క‌న్నీటి క‌థ‌'.. రీజనేంటి?

పైకి గంభీరంగా ఉన్న‌ప్ప‌టికీ.. విజ‌య‌మ్మ‌లో ఆత్మ ఎంత ఆవేద‌న చెందుతోందో సోమ‌వారం వైఎస్ రాజ‌శే ఖర‌రెడ్డి స‌మాధి సాక్షిగా ఆమె పెట్టుకున్న క‌న్నీటిని ప్ర‌త్య‌క్షంగా చూసిన వారికి తెలుస్తోంది.

Update: 2024-07-08 09:32 GMT

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మాతృమూర్తి, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమ‌ణి విజ‌య‌మ్మ వ‌ల‌వ‌లా ఏడ్చే శారు. కుమారుడిని చూసి.. క‌న్నీరు కార్చేశారు. ఇది న‌ట‌న కాదు. ఏదో మీడియా ముందు.. సింప‌తీ కోసం జాలువారిన క‌న్నీరు కానేకాదు. అంత‌రంగ మ‌ధ‌నం నుంచి ఉవ్వెత్తున ఎగిసి ప‌డిన ఆత్మావేద‌న‌!! ఏ త‌ల్లికైనా.. బిడ్డ‌లు బాగుండాల‌నే ఉంటుంది. కూటి లేని కుటుంబంలో కూడా పిల్ల‌లు కలిసి ఉండాల‌నే ఏత‌ల్ల‌యినా కోరుకుంటుంది. కానీ, కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వైఎస్ కుటుంబంలో పిల్ల‌లు చెల్లాచెదురై.. త‌ల్లికి గ‌ర్భ‌శోకం మిగ‌ల్చ‌డం.. త‌ల్లిముందే.. రాజ‌కీయ దుమారాల‌కు.. విమ‌ర్శ‌ల‌కు తెర‌దీయ‌డం.. వంటివి విజ‌య‌మ్మ‌ను క‌లిచి వేస్తున్నాయి.

పైకి గంభీరంగా ఉన్న‌ప్ప‌టికీ.. విజ‌య‌మ్మ‌లో ఆత్మ ఎంత ఆవేద‌న చెందుతోందో సోమ‌వారం వైఎస్ రాజ‌శే ఖర‌రెడ్డి స‌మాధి సాక్షిగా ఆమె పెట్టుకున్న క‌న్నీటిని ప్ర‌త్య‌క్షంగా చూసిన వారికి తెలుస్తోంది. సోమ‌వారం వైఎస్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని క‌డ‌ప‌లోని ఇడుపుల పాయ ఎస్టేట్‌లో ఉన్న వైఎస్ స‌మాధి వ‌ద్ద మాజీ సీఎం జ‌గ‌న్ నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాతృమూర్తి విజ‌య‌మ్మ కూడాపాల్గొ న్నారు. తొలుత పార్థ‌న‌లు చేశారు. అనంత‌రం.. కొద్దిసేపు మౌనం పాటించారు. ఆ త‌ర్వాత‌.. కుమారుడు జ‌గ‌న్‌ను ప‌క్క‌కు తీసుకుని.. ఆలింగ‌నం చేసుకున్న విజ‌య‌మ్మ అప్ప‌టి వ‌ర‌కు ఓర్పు వ‌హించిన త‌న బాధ‌ను దాచుకోలేక పోయారు. క‌న్నీరు రూపంలో త‌న ఆవేద‌న‌ను బ‌య‌ట‌కు క‌క్కేశారు. వ‌ల‌వ‌లా ఏడ్చేశారు. ఈ దృశ్యం చూప‌రుల‌ను సైతంఆవేద‌న‌లో ముంచేసింది.

ఎందుకీ బాధ‌?

కుమారుడు అధికారం కోల్పోయాడ‌న్న ఆవేద‌న‌తో విజ‌య‌మ్మ బాధ‌ప‌డ్డారా? లేక‌.. సోద‌రి వ‌ర్సెస్ సోద‌రు డు మ‌ధ్య జ‌రుగుతున్న రాజ‌కీయ స‌మ‌రాన్ని తాను చూడ‌లేక ఆవేద‌న చెందుతున్నారా? రెండూ కార‌ణా లై ఉండొచ్చు. కానీ, ఈ వ‌య‌సులో ప్ర‌శాంతత లేని కుటుంబం కూడా ఆమెను మ‌రింత ఆవేద‌న‌కు గురి చేస్తోంద‌న్న‌ది వాస్త‌వం. క‌డుపున పుట్టిన‌ ఇద్ద‌రు పిల్ల‌లు రాజ‌కీయ కీచులాట‌ల్లో తార‌స్తాయికి చేరుకోవ‌డం.. మొండిగా ముందుకు సాగుతుండ‌డం వంటివి.. విజ‌య‌మ్మ‌ను తీవ్ర‌స్థాయిలో రోద‌న‌కు గురి చేశాయ‌న్న‌ది వాస్త‌వం. అందుకే ఎన్నిక‌ల‌కు ముందు ఆమె అమెరికాకు వెళ్లిపోయారు. తిరిగి వ‌చ్చే స‌రికి.. కుమారుడు చిత్తుగా ఓడిపోయాడు. కుమార్తె కూడా.. అనుకున్న‌ది సాధించ‌లేక పోయారు. మ‌రి ఈ త‌గువు ఎందుకు? ఎవ‌రికోసం? ఇదీ.. ఇప్పుడు విజ‌య‌మ్మ ఆవేద‌న‌కు క‌న్నీటికి కార‌ణ‌మై ఉండొచ్చు!! ఏదైనా ఈ స‌మ‌స్య‌కు కాల‌మే ప‌రిష్కారం చూపాలి.

Tags:    

Similar News