సోనియాతో షర్మిల భేటీ... ముహూర్తం ఫిక్స్?

కర్ణాటక రాష్ట్ర డిప్యుటీ సీఎం ఆ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్... సోనియా గాంధీ తో వైఎస్ షర్మిళ భేటీకి ప్లాన్ చేశార ని అంటున్నారు!

Update: 2023-07-14 04:17 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తుంది. మరిముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ కూడా దూకుడు మీదుందని అంటున్నారు. ఇందులో భాగంగా... సోనియా గాంధీ తో వైఎస్ షర్మిళ భేటీ కానున్నారని తెలుస్తుంది!

అవును... గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో.. మరి ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిళ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ టీపీ ని కాంగ్రెస్ విలీనం చేయాలనే ప్రతిపాదన షర్మిళ కు వచ్చిందని... మరోపక్క షర్మిళ మాత్రం పొత్తుకోసం ప్రాకులాడుతున్నారని కథనాలోస్తున్న సంగతి తెలిసిందే!

ఈ నేపథ్యంలో పొత్తు విలీనం... ఏదనే విషయం పై ఇప్పటివరకూ స్పష్టత లేకపోయినా... పోటీచేసేది మాత్రం తెలంగాణ నుంచే అని పాలేరు నియోజకవర్గం లోనే అని ఇప్పటికే షర్మిళ చెప్పారని అంటున్నారు. ఇదే సమయం లో ఇప్పటికే పలువురు కీలక నేతల చేరికలతో తెలంగాణ లో కాంగ్రెస్ దూకుడుమీదుందని అంటున్నారు. ఇక షర్మిళ విషయం లో కూడా ఒక కన్ క్లూజన్ కి వచ్చేయాల ని హస్తిన పెద్దలు ఆలోచిస్తున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా... కర్ణాటక రాష్ట్ర డిప్యుటీ సీఎం ఆ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్... సోనియా గాంధీ తో వైఎస్ షర్మిళ భేటీకి ప్లాన్ చేశార ని అంటున్నారు! ఈ నెల 17-18 న బెంగళూరు లో జరిగే విపక్షాల సమావేశానికి సోనియా గాంధీ హాజరవుతారంటూ కథనాలొస్తున్న తరుణంలో... ఈ భేటీకి డీకే ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు!

దీంతో వైఎస్ షర్మిళతో భేటీకి సోనియా అంగీకరించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. పైగా... చాలా కాలం తరువాత తాజాగా వైఎస్సార్ జన్మదినం నాడు పార్టీ ముఖ్య నేతలు రాహుల్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే చేసిన ట్వీట్ల ద్వారా వైఎస్సార్ కు కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉందనే సంకేతాలు ఇచ్చారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోపక్క షర్మిళ తో కాంగ్రెస్ పార్టీ పొత్తో విలీనమో.. ఏదైనా ఈ విషయాన్ని కొంతమంది నేతలు అంగీకరించడం లేదనే కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. రేణుకా చౌదరి లాంటి వారు... షర్మిళ ఎవరో తెలియదు అంటూ కామెంట్ చేశార ని అంటున్నారు. ఇదే సమయం లో నిన్నమొన్నటివరకూ షర్మిళ రాక పై భిన్నంగా స్పందించిన మరో ఎంపీ చింతామోహన్ సైతం... తన వాయిస్ మార్చిన సంగతి తెలిసిందే!

ఇదే సమయం లో షర్మిళ ను కాంగ్రెస్ లోకి రప్పించే విషయం లో జానారెడ్డి భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవీపీ రామాచంద్రరావు వంటి సీనియర్లు సానుకూలంగా ఉన్నారని సహకారాన్ని కూడా అందిస్తున్నారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారని అంటున్నారు! ఏది ఏమైనా... ఈ నెల లో షర్మిళ పొలిటికల్ ఫ్యూచర్ పై ఒక క్లారిటీ రావొచ్చని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News